Radhe Shyam:షాకింగ్ విషయం రివీల్... 75 కోట్లకు పైగా ఎగస్ట్రా బర్డెన్


వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా "రాధే శ్యామ్" చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

75 Crore more spent on the sets of Radhe Shyam!


యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్‌' మూవీ విడుదల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచినా.. కోవిడ్‌ కారణాల రీత్యా విడుదల వాయిదా పడింది. అయితే అభిమానుల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టకుండా  చిత్రయూనిట్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. తాజాగా 'రాధేశ్యామ్‌' మార్చి 11న విడుదల కానున్నదని ఆ చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.   'లవ్‌, డెస్టినీకి మధ్య జరిగే యుద్ధాన్ని మార్చి 11న వీక్షించండి' అంటూ చిత్రయూనిట్‌ సామాజిక మాధ్యమం ద్వారా అనౌన్స్‌ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన కొత్త విషయాలు బయిటకు వచ్చి ఆశ్చర్యం కలగచేస్తున్నాయి. ఏమిటా విశేషం అంటే...ఈ సినిమాకు అయిన ఎగస్ట్రా బడ్జెట్ గురించి.

ఈ సినిమా షూట్ టైమ్ లో కోవిడ్ రావటంతో ఫారిన్ లొకేషన్స్ లో ప్రీగా షూట్ చేయలేకపోయింది. దాంతో ఇక్కడే రామోజి ఫిల్మ్ సిటీలో ఈ సినిమా సెట్ వేయటం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రం ఆర్ట్ డైరక్టర్ రవీంద్ర మీడియాతో తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ...ఎగ్జాక్ట్ గా ఆ సెట్ నిమిత్తం ఎంత అయ్యిందని బయిటకు రివీల్ చేయలేమన్నారు. అయితే ఆయన్ని ఇంటర్వూ చేస్తున్న మీడియా వ్యక్తి 75 కోట్లు దాకా ఖర్చు పెట్టారు అనగా...అంతకు మించే ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రివీల్ చేసారు. ఇది మొదట అనుకున్న బడ్జెట్ కాదట. తర్వాత కలిసిన బడ్జెట్.  కాగా, రాధేశ్యామ్‌ చిత్రం సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌ పాన్‌ ఇండియా లెవల్లో నిర్మించారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ లవర్‌బాయ్ గా, హస్తకళా నిపుణుని పాత్రలో నటించారు. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించగా, వంశీ ప్రమోద్‌, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రకంగా చెప్పుకోవాలంటే.. ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పనిచేయడం సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పనిచేశారు. జస్టిన్‌ ప్రభాకరన్‌, అర్జిత్‌ సింగ్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, జబిన్‌ నౌతీయల్‌, మనోజ్‌ ముంటాషిర్‌, కుమార్‌, రష్మీ విరాగ్‌ బృందం అంతా కలిసి సౌత్‌, నార్త్‌ వర్షన్స్‌కు రాధే శ్యామ్‌ సినిమాకు అద్భుతమైన క్లాసిక్‌ సంగీతం అందిస్తున్నారు.

వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా "రాధే శ్యామ్" చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 60ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios