MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఆడవాళ్లూ.. పదే పదే మూత్రం వస్తోందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

ఆడవాళ్లూ.. పదే పదే మూత్రం వస్తోందా? అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!

మూత్రం మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతుంది. అవును మూత్రవిసర్జన వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కానీ కొంతమంది ఆడవారికి రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. నిజానికి ఇలా పదే పదే మూత్రం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. అవేంటంటే? 
 

Shivaleela Rajamoni | Published : Nov 14 2023, 01:49 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image


నీళ్లను బాగా తాగితే మూత్రం కూడా ఎక్కువ సార్లు వస్తుంది. అయితే పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా పదే పదే మూత్ర విసర్జన చేయడం మాత్రం కొన్ని సమస్యలకు సంకేతమే. ఇలా మూత్రం పదే పదే వస్తోందని చాలా మంది నీళ్లను తాగడం మానేస్తుంటారు. కానీ నీళ్లను తాగకపోతే మీ శరీరం డీహైడ్రేట్ అువతుంది. ఇది ఒక్కోసారి మీ ప్రాణాలను కూడా తీసేయగలదు. అందుకే నీళ్లను పుష్కలంగా తాగండి. నీళ్లతోనే మన శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోజుకు 3 నుంచి 7 సార్లు మూత్ర విసర్జన చేయడం పూర్తిగా సాధారణం. అయితే మీరు రోజుకు 1 నుంచి 2 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మీ ఆరోగ్యం రిస్క్ లో పడినట్టే. ఈ సంగతి పక్కన పెడితే.. అసలు ఇలా పదే పదే మూత్రవిసర్జన ఎందుకు వస్తోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25
Urinary

Urinary

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రపిండాలు, మూత్రాశయం, గర్భాశయంతో పాటుగా మొత్తం మూత్ర వ్యవస్థను ప్రభావితం చేసే సంక్రమణ. యూటీఐ సమస్య ఉంటే.. హానికరమైన బ్యాక్టీరియా యోని లేదా మూత్రాశయం వైపు కదులుతుంది. దీనివల్ల కటి నొప్పి, మూత్రంలో చికాకు, నొప్పి, మూత్రంలో రక్తం రావడం వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇ.కోలి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణం. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, నీళ్లను తక్కువగా తాగడం, బహిరంగ మరుగుదొడ్లను వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్లే ఆడవారు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తది. 
 

35
Asianet Image

డయాబెటిస్

ప్రతి నిమిషానికోసారి మూత్ర విసర్జన చేస్తున్నట్టైతే మీకు డయాబెటీస్ ఉన్నట్టే. ఎందుకంటే ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్  ప్రారంభ సంకేతం. నిజానికి రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగడం వల్ల.. దాని ప్రభావం మూత్రాశయం, మూత్రపిండాలపై పడుతుంది. ఇది మూత్రవిసర్జనతో శరీరంలోని నీటిని ఎక్కువగా బయటకు పంపుతుంది. దీనివల్లే డయాబెటీస్ పేషెంట్ మూత్రవిసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అందుకే  వీళ్లు ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు.
 

45
Asianet Image

ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్

ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్ కూడా పదే పదే మూత్ర విసర్జనకు  కారణమవుతుంది. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్ అసోసియేషన్ ప్రకారం.. ఈ సమస్య యునైటెడ్ స్టేట్స్ లో 12 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. పిల్లలు, పురుషుల కంటే మహిళలకే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంటర్స్టీషియల్ సిస్టిటిస్ ను మూత్రాశయ సిండ్రోమ్ (పిబిఎస్), మూత్రాశయ నొప్పి సిండ్రోమ్ (బిపిఎస్), దీర్ఘకాలిక కటి నొప్పి (సిపిపి) అని కూడా అంటారు. 
 

55
Asianet Image

గర్భధారణ 

గర్భం వల్ల కూడా పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. గర్భం దాల్చిన మొదటి వారంలో మూత్రాశయంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీనివల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అయితే ఇలా డెలివరీ అయ్యే వరకు ఉంటుంది. ఇది ప్రతి మహిళ ఎదుర్కొనే సర్వసాధారణ సమస్య. నిజానికి గర్భాశయం సంకుచితం కావడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే  హార్మోన్ల మార్పులు కూడా తరచూ మూత్ర విసర్జనకు కారణమవుతాయి.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories