ఇంట్లో గరం మసాలా పౌడర్ ను ఎలా తయారు చేయాలో తెలుసా?
గరం మసాలాను మనం చాలా రకాల వంటల్లో వేస్తుంటాం. గరం మసాలా వంటలనే టేస్టీగా చేస్తుంది. అయితే చాలా మంది వీటిని కిరాణం షాపుల్లోనే కొంటుంటారు. కానీ మీరు ఇంట్లో కూడా గరం మసాలాను తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇండియన్ ఫుడ్స్ టేస్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యాయి. దీనికి ఒక కారణం మాసాలాలే అంటారు నిపుణులు. అవును మన దేశంలో మసాలాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఫుడ్ టేస్ట్ ను బాగా పెంచుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ చాలా కూరల్లో గరం మసాలా పౌడర్ ను వేస్తుంటారు.అయితే ఈ గరం మసాలా మిక్స్ పౌడర్ ను ఇంట్లో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గరం మసాలా అంటే?
గరం మసాలా సాధారణంగా దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలతో తయారవుతుంది. ఇది మంచి సువాసన వస్తుంది. దీనిని రకరకాల వంటల్లో వేయడం వల్ల వాటి రుచి పెరుగుతుంది.
ఇంట్లో గరం మసాలాను ఎలా తయారుచేయాలి?
ముందుగా ఒక మందపాటి పాన్ ను తీసుకుని దానిలో 3/4 కప్పుల ధనియాలను వేయండి. వీటిని తక్కువ మంట మీద వేయించండి. ఈ మసాలా దినుసులు సువాసన వచ్చే వరకు వేయించి తర్వాత పక్కన పెట్టేయండి.
ఆ తర్వాత 1/2 కప్పు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాజీరను వేసి కలపండి. వీటిని తక్కువ మంట మీద వేయించండి. దీని నుంచి సువాసనగా వస్తుంటే పక్కన పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 3 ఎండుమిర్చి తీసుకుని మందపాటి పాన్ లో వేయించండి. వీటి నుంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
garam-masala
ఆ తర్వాత 5 స్టార్ సోంపు ముక్కలు, 3 అంగుళాల దాల్చినచెక్క, 2 గరిక ముక్కలు, 5 నల్ల యాలకులు, 2 జాజికాయ ముక్కలు, 3 టీస్పూన్ల యాలకులు, 1 టేబుల్ స్పూన్ లవంగం, 2 టీస్పూన్ల సోంపు, 5 బే ఆకుల ముక్కలు వేసి వేయించుకోండి. ఈ మసాలా దినుసుల నుంచి సువాసన వచ్చే వరకు వేయించండి. అయితే ఇవి మాడిపోకుండా చూసుకోవాలి.
అన్ని మసాలా దినుసులు చల్లారిన తర్వాత వాటన్నింటినీ ఒక మిక్సీలో వేసి 1 టీస్పూన్ అల్లం పొడిని మిక్సీ పట్టండి. అంతే.. మీ ఇంట్లో తయారుచేసిన గరం మసాలా రెడీ! ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేయండి.