- Home
- Life
- Woman
- How to Check Gas in Cylinder: ఇలా చూస్తే.. సిలిండర్ లో ఎంత గ్యాస్ మిగిలుందో తెలుస్తుంది
How to Check Gas in Cylinder: ఇలా చూస్తే.. సిలిండర్ లో ఎంత గ్యాస్ మిగిలుందో తెలుస్తుంది
How to Check Gas in Cylinder: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో ఎవ్వరికీ తెలియదు. దీనివల్ల చాలా సార్లు వంట మధ్యలోనే గ్యాస్ అయిపోతుంటుంది.కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో సిలిండర్ లో గ్యాస్ ఎంతుందో ఈజీగా తెలుసుకోవచ్చు.

Gas check in Cylinder: ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. కట్టెల పొయ్యిని ఎవ్వరూ వాడటం లేదు. కట్టెల పొయ్యి కంటే గ్యాస్ సిలిండర్ పైనే వంట ఫాస్ట్ గా, సులువుగా అవుతుంది. కానీ వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా అయిపోతుంటాయి. ఇది ఆడవారికొచ్చే అతిపెద్ద సమస్య.
దీనివల్ల ఫుడ్ మొత్తం ఉడకదు. అంతేకాకుండా రాత్రిపూట గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేయడానికి రాదు. అదే గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంతుంది? ఎప్పుడు అయిపోతుందో తెలుసుకుంటే ముందే వంటకు ఎలాగోలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అందుకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంతుందనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో ఎలా తెలుసుకోవాలి?
తడి గుడ్డ
అవును తడి గుడ్డ సహాయంతో గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక తడి గుడ్డను తీసుకుని సిలిండర్ చుట్టూ చుట్టండి. 5 నిమిషాల తర్వాత తీసేయండి. ఇప్పుడు చెక్ చేయండి. అంటే సిలెండర్ భాగంలో పచ్చిగా అంటే తేమగా ఎంత వరకు ఉంటే.. అంత వరకు గ్యాస్ ఉన్నట్టు. ఒకవేళ గ్యాస్ సిలిండర్ మొత్తం డ్రై అయితే గ్యాస్ అయిపోయిందని అర్థం.
మంట కలర్
గ్యాస్ మంట రంగును బట్టి కూడా మీరు గ్యాస్ సిలిండర్ నిండుగా ఉందా? అయిపోవడానికి దగ్గర పడిందా? అన్న సంగతిని తెలుసుకోవచ్చు. అంటే మంట రంగు నీలం, బలంగా ఉంటే సిలిండర్ లో తగినంత ఉందని అర్థం చేసుకోండి. అదే మంట పసుపు రంగులో వచ్చి మంట బలహీనంగా ఉంటే గనుక గ్యాస్ త్వరలోనే అయిపోబోతోందని అర్థం చేసుకోండి.
బరువును బట్టి చెక్ చేయండి
సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందనేది గ్యాస్ బండ బరువును బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం గ్యాస్ సిలిండర్ ను పైకి ఎత్తండి. బరువును చెక్ చేయండి. సిలిండర్ బరువు ఎక్కువగా కనిపిస్తే ఉంటే.. గ్యాస్ బాగానే ఉందని అర్థం చేసుకోండి. అదే బరువు తక్కువగా అనిపిస్తే అదే గ్యాస్ తక్కువగా ఉందని అర్థం చేసుకోండి.