MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • ఉసిరి గుజ్జు మాత్రమే కాదు.. వాటి గింజలు కూడా ఉపయోగపడతాయ్.. ఎలాగంటే?

ఉసిరి గుజ్జు మాత్రమే కాదు.. వాటి గింజలు కూడా ఉపయోగపడతాయ్.. ఎలాగంటే?

చలికాలంలో ఉసిరికాయలు పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పచ్చళ్లతో పాటుగా ఎన్నో రకాల వంటలు చేసుకుని తినొచ్చు. అయితే చాలా మంది ఉసిరి గుజ్జును మాత్రమే ఉపయోగించుకుని వాటి గింజల్ని పారేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఉపయోగపడతాయి తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 24 2024, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉసిరికాయ మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లాంటిది తెలుసా? ఎందుకంటే దీనిలో ఉండే ఎన్నో ఔషద లక్షణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. ఈ ఉసిరికాయలు చలికాలంలో బాగా దొరుకుతాయి. ఇంకేముంది వీటిలో పచ్చళ్లు, పులిహోర వంటి రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు. 

అయితే ప్రతి ఒక్కరూ ఉసిరి గుజ్జును మాత్రమే ఉపయోగిస్తారు. వీటి గింజలు పనికిరావని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఉపయోగపడతాయి తెలుసా? వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి మంచి టేస్ట్ గా కూడా ఉంటాయి. అందుకే వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
amla

amla

మసాలా దినుసుగా ఉసిరికాయ గింజల పొడి

ఉసిరి గింజలను మసాలా దినుసుగా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఈ గింజల పొడిని వాడండి. ఈ మసాలా పొడిని తయారుచేయడానికి ఉసిరి గింజల్ని 3 నుంచి 4 రోజుల పాటు ఎండబెట్టండి. ఆ తర్వాత వీటిని బ్లెండర్ లో మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పొడిని మీకు నచ్చిన రకరకాల వంటల్లో మసాలాగా ఉపయోగించుకోండి.  బిర్యానీ లేదా పులావ్ పై కొంచెం ఉసిరి పొడిని చల్లితే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీన్ని సూప్ లల్లో కూడా వేయొచ్చు. 
 

35

ఉసిరి గింజల పచ్చడి

అవును ఉసిరి గింజల పచ్చడిని కూడా తయారుచేయొచ్చు. మీరు ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లలో ఉసిరి గింజల్నీ వేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇందుకోసం ఉసిరిగింజల్ని ఎండబెట్టండి. లేదా నూనె లేదా నెయ్యిలో వేయించండి. ఈ గింజలు మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వంటి పదార్థాలతో గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ స్పైసీ చట్నీని స్నాక్స్ తో డిప్ గా లేదా అన్నం, పప్పులతో సైడ్ డిష్ గా తినొచ్చు. 
 

45

ఉసిరి గింజల్తో బేకింగ్

ఈ  గింజల పొడిని బ్రెడ్, మఫిన్లు లేదా కేక్ పిండిలో కలపొచ్చు. ఇది మంచి టేస్ట్ వచ్చేలా చేస్తుంది. అలాగే పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే ఈ గింజల్ని వేయించి కుకీలకు క్రంచ్ ను జోడించడానికి వీటిని టాపింగ్లుగా యూజ్ చేయొచ్చు. 

ఉసిరి గింజల టీ 

ఉసిరి గింజల్తో టీ ని తయారుచేసి తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.  ఇందుకోసం ఉసిరికాయ గింజల్లో నీళ్లు, అల్లం, కొంచెం తేనె వేసి మరిగించండి. దాన్ని వడకట్టి వేడివేడిగా తాగండి. ఈ హెల్తీ టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 

55
amla

amla

ఊరగాయ

ఉసిరికాయ గింజలతో ఊరగాయను కూడా తయారుచేయొచ్చు. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందుకోసం నిమ్మకాయ లేదా మామిడి ఊరగాయ వంటి ఊరగాయల్లో ఉసిరిగింజలను వేయండి. ఈ గింజలను మసాలాలను, నూనెలను గ్రహిస్తాయి. అలాగే ఊరగాయను టేస్టీగా చేస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved