ప్రపంచంలో బట్టతల ఉన్న పురుషులు అత్యధికంగా ఉన్న టాప్ టెన్ దేశాలు..
మగవాళ్ళ అందమంతా జుట్టు లోనే ఉంటుంది. అందుకే హెయిర్ స్టైల్ కి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే బట్టతల వస్తే పురుషులు పడే బాధ అంతా కాదు. దాన్ని కవర్ చేసుకోవడానికి టోపీలు, విగ్గులు వంటివి ఉపయోగిస్తూ అవస్థలు పడుతుంటారు. సూపర్ హెయిర్ పీసెస్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ సంయుక్తంగా అందించిన సర్వే వివరాల ప్రకారం ప్రపంచంలో బట్టతల ఉన్న పురుషులు అత్యధికంగా ఉన్న టాప్ టెన్ దేశాలు ఇవే ..
1. చెకియా(czechia)
ఈ దేశంలో 1,09,00,555 ప్రజలు జీవిస్తున్నారు. అయితే వీరిలో 42.8 శాతం మంది పురుషులు బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో బట్టతల అత్యధికంగా ఉన్న పురుషులు ఉన్న దేశంగా ఈ దేశం నిలిచింది.
2. స్పెయిన్ (spain)
ఈ దేశ పాపులేషన్ 4,86,92,804. వీరిలో 42.6 శాతం మంది పురుషులకు బట్టతల వచ్చేసింది. చెకియా కంటే కేవలం 0.2 తక్కువ శాతంతో ఈ దేశం రెండో స్థానంలో నిలిచింది.
3. జర్మనీ (Germany)
మూడో స్థానంలో ఉన్న జర్మనీ లో 41.2 శాతం మంది పురుషులు జుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ దేశం పాపులేషన్ 8,46,69,326.
4. ఫ్రాన్స్ (france), యూకే (UK)
సర్వేలు ఈ రెండు దేశాలు నాలుగో స్థానంలో నిలిచాయి. ఫ్రాన్స్ పాపులేషన్ 6,83,73,433 కాగా.. UK జనాభా సుమారు 6,75,96,281. ఈ దేశాల్లో 39.2 శాతం మంది పురుషులకు హెయిర్ లాస్ అయ్యింది.
5. ఇటలీ (italy)
ఫ్రాన్స్, UK తో పోలిస్తే ఇటలీ దేశంలో కొంచెం తక్కువగా దాదాపు 39.2 శాతం మంది పురుషులు బట్టతలతో ఉన్నారు. ఈ దేశ జనాభా 5,89,68,501.
6. నెదర్లాండ్స్ (netherlands)
ప్రపంచంలో తక్కువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి నెదర్లాండ్స్. ఈ దేశ జనాభా 1,81,46,200 కాగా వీరిలో 38.9% పురుషులకు తలపై జుట్టు సరిగా లేదు.
7. పోలాండ్ (poland)
సర్వేలో ఏడుస్థానంలో ఉన్న పోలాండ్ నిలిచింది. ఈ దేశంలో 3,66,20,970 జీవిస్తున్నారు. వీరిలో 38.8% మందికి బట్టతల ఉందని సర్వే చెబుతోంది.
8. యూఎస్ఏ (USA)
అమెరికా అంటేనే అనేక దేశాల ప్రజలు అక్కడ కలిసి జీవిస్తుంటారు. ప్రస్తుత యూఎస్ఏ పాపులేషన్ దాదాపుగా 33,49,14,895. సర్వే ప్రకారం ఈ దేశంలో 37.9 % పురుషులు జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
9. కెనడా (canada)
దాదాపుగా 4,10,12,563 మంది జనాభా నివసిస్తున్న ఈ దేశంలో 36.3 % పురుషులు బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు.
10. బెల్జియం(belgium)
సర్వేలో చివరిగా నిలిచిన దేశం బెల్జియం. ఈ దేశంలో 36 % మంది పురుషులు హెయిర్ లాస్ అయ్యారు. ఈ దేశ జనాభా సంఖ్య 1,17,63,650.