- Home
- Sports
- Tennis
- Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా స్వియాటెక్.. పొలాండ్ తొలి ఛాంపియన్‌గా రికార్డు
Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా స్వియాటెక్.. పొలాండ్ తొలి ఛాంపియన్‌గా రికార్డు
Iga Swiatek: వింబుల్డన్ 2025 ఫైనల్లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్, అమెరికన్ అమండా అనిసిమోవాపై 6-0, 6-0తో ఘనవిజయం సాధించింది. వింబుల్డన్ లో తన తొలి క్లే కోర్టు గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.

స్వియాటెక్‌కు వింబుల్డన్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్
పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. గేమ్ లో తను పూర్తి ఆధిపత్యం చూపించింది.
సెంటర్ కోర్ట్‌లో జరిగిన ఫైనల్లో అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవాపై 6-0, 6-0తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో స్వియాటెక్ తన ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.
డబుల్ బాగెల్ విజయంతో స్వియాటెక్ చరిత్ర
స్వియాటెక్ గెలిచిన ఈ ఫైనల్, ఓపెన్ ఎరాలో రెండోసారి మాత్రమే నమోదైన డబుల్ బాగెల్ ఫలితాన్ని నమోదు చేసింది. అంతకు ముందు 1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీ గ్రాఫ్ నతాషా జ్వెరేవాపై 6-0, 6-0తో గెలిచిన సందర్భం మాత్రమే ఉంది. వింబుల్డన్‌లో ఇలాంటి ఫలితం చివరిసారిగా 1911లో నమోదైంది.
ఫాస్టెస్ట్ ఫైనల్ – కేవలం 57 నిమిషాల్లో విజయం
స్వియాటెక్ తన ఆధిపత్యాన్ని తొలి గేమ్ నుంచే చూపింది. మొదటి సెట్లో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదురుకాకుండా 25 నిమిషాల్లో 6-0తో సెట్ ను గెలిచింది. రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి 6-0తో ముగించింది. మొత్తం మ్యాచ్ కేవలం 57 నిమిషాల్లో ముగిసింది. ఇది ఓపెన్ ఎరాలో ఏడవ వేగవంతమైన వింబుల్డన్ మహిళల ఫైనల్‌గా నమోదైంది.
స్వియాటెక్ చరిత్రాత్మక ఘనత
ఇప్పటివరకు మట్టి కోర్టుల్లో తన పవర్ ను చూపించిన స్వియాటెక్, ఈ గ్రౌండ్ పై విజయం సాధించడం ఆమె టెన్నిస్ కెరీర్‌కు మైలురాయిగా మారింది. వింబుల్డన్‌లో ఇప్పటివరకు క్వార్టర్‌ఫైనల్ దాటని ఆమె, ఈసారి టైటిల్‌ను గెలవడం విశేషం. ఇప్పటివరకు ఆమె ఆడిన అన్ని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లోనూ (6) గెలిచిన రికార్డును కొనసాగించింది.
అనిసిమోవా అదిరిపోయే రీఎంట్రీ
23 ఏళ్ల అమెరికన్ అమండా అనిసిమోవా, 2023లో మానసిక ఆరోగ్య కారణాలతో ఆటకు విరామం ఇచ్చిన తర్వాత అద్భుతంగా తిరిగొచ్చింది. గత ఏడాది ర్యాంకింగ్స్‌లో టాప్ 400 బయట ఉన్న ఆమె, ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్‌కు చేరడం గొప్ప విషయం. సెమీఫైనల్‌లో వరల్డ్ నెం.1 సబలెంకాను ఓడించి ఆకట్టుకుంది. అయితే, ఫైనల్‌లో స్వియాటెక్ దెబ్బకు తట్టుకోలేకపోయింది.
వింబుల్డన్ 2025 ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో సుమారుగా..)
ఈ ఏడాది వింబుల్డన్ మహిళల విజేతకు £3 మిలియన్ (సుమారుగా $4.09 మిలియన్) బహుమతిగా లభించింది. ఇది గత సంవత్సరం కంటే 11.1% ఎక్కువ. మొత్తం టోర్నీకి కలిపి పురుషులు, మహిళలకు సమానంగా £38.8 మిలియన్ (దాదాపు $52.9 మిలియన్) ప్రైజ్ మనీని కేటాయించారు.
విజేత: రూ. 34,17,56,513 (సుమారు 34.17 కోట్లు) రన్నర్-అప్: రూ. 17,32,63,887 (సుమారు 17.33 కోట్లు) సెమీఫైనలిస్టులు: రూ. 8,83,15,776 (సుమారు 8.83 కోట్లు) క్వార్టర్ ఫైనలిస్టులు: రూ. 4,55,12,228 (సుమారు 4.55 కోట్లు) 4వ రౌండ్: రూ. 2,73,49,452 (సుమారు 2.73 కోట్లు) 3వ రౌండ్: రూ. 1,73,20,879 (సుమారు 1.73 కోట్లు) 2వ రౌండ్: రూ. 1,12,41,619 (సుమారు 1.12 కోట్లు) 1వ రౌండ్: రూ. 75,36,087 (సుమారు 75.36 లక్షలు)