MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కడుపునొప్పని భర్తకు చెప్పి.. అల్లుడితో లాడ్జిలో గడిపిన అత్త.. చివరికి ఏం జరిగిందంటే..

కడుపునొప్పని భర్తకు చెప్పి.. అల్లుడితో లాడ్జిలో గడిపిన అత్త.. చివరికి ఏం జరిగిందంటే..

ఓ మహిళ వరుసకు అల్లుడయ్యే వ్యక్తితో లాడ్జికి వెళ్లింది. అక్కడ రాత్రి గడిపిన తరువాత ఆమె ఆత్హహత్య చేసుకుంది. అయితే అది హత్య అని పోలీసులకు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 18 2023, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భద్రాచలం : తెలంగాణలోని భద్రాచలంలో ఓ మహిళ అనుమానాస్పద మృతి విషయంలో ఆమెకు అల్లుడి వరస అయ్యే వ్యక్తి మీద కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆదివారం పట్టణంలోని ఓ లాడ్జిలో రావూరి అరుణ (35)  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమెను హత్య చేసినట్లుగా అరుణ కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అరుణకు అల్లుడు వరస అయ్యే ఆంజనేయులు ఈ హత్య చేసినట్లు వారు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ఈ విధంగా ఉంది…రావూరి అరుణ ఆమె భర్త కృష్ణారావుతో కలిసి హైదరాబాదులోని ఓ కోళ్ల ఫామ్ లో కూలీ పనులు చేసుకుంటోంది. అరుణ తనకు కడుపులో నొప్పి వస్తుందని ఈనెల 14వ తేదీన తన సొంత గ్రామమైన తిరువూరుకు బయలుదేరింది. 

35

అక్కడ వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పింది. అలా హైదరాబాదు నుంచి బయలుదేరిన ఆమె సొంతూరుకు వెళ్లకుండా భద్రాచలం వెళ్ళింది. ఖమ్మం జిల్లాలోని కప్పలబంధం గ్రామానికి చెందిన ఆంజనేయులుతో భద్రాచలంలోని ఒక లాడ్జిలో గది తీసుకుంది. ఆంజనేయులు అరుణ భర్త కృష్ణార్జునరావుకు మేనల్లుడు అవుతాడు. అలా అల్లుడి వరస అయ్యే వ్యక్తితో ఆ రోజంతా ఆ గదిలోనే గడిపింది. 

45

ఆ తర్వాత ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని భయపడి లాడ్జి గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఈ మేరకు లాడ్జి నిర్వాహకులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులు అరుణ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి హుటాహుటిన  భద్రాచలం చేరుకుని అరుణమృతదేహాన్ని పరిశీలించారు. కాగా ఆమె మెడ చుట్టూ కమిలిన గాయాలు ఉండడాన్ని గమనించారు.

55

దీన్ని బట్టి ఆంజనేయులు అరుణ మెడకి చీరను చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. అరుణను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ త్రీ నాటు కింద కేసు నమోదు చేశారు.  దీనిమీద విచారణ చేపట్టినట్లుగా సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image2
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Recommended image3
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved