MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : నేటి సెలవు రేపటికి మారిందా? ఇక వరుసగా రెండ్రోజులు సెలవులేనా?

School Holidays : నేటి సెలవు రేపటికి మారిందా? ఇక వరుసగా రెండ్రోజులు సెలవులేనా?

School Holidays : ఓవైపు మండుటెండలు, మరోవైపు పరీక్షల ఒత్తిడితో సతమతం అవుతున్న విద్యార్థులకు తీపికబురు. ఈ వీకెండ్ వర్షాలు కురిసే అవకాశం ఉండటతో ఎండలు తగ్గనుండగా రెండ్రోజులు సెలవులు కూడా వస్తున్నాయి. రేపు సెలవు ఎందుకో తెలుసా?

3 Min read
Arun Kumar P
Published : Mar 21 2025, 01:44 PM IST| Updated : Mar 21 2025, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
School Holidays

School Holidays

Holidays : సెలవు... ఈ పదం వినిపిస్తే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. స్కూల్ కు ఎప్పుడు సెలవు వస్తుందా అని చిన్నారులు ఎదురుచూస్తుంటారు... హాలిడే వచ్చిందంటే పుస్తకాలు, చదువును పక్కనబెట్టి హాయిగా ఆటాపాటలతో, అమ్మానాన్నతో గడపాలని కోరుకుంటారు. ఇక ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కూడా హాలిడే వచ్చిందంటే పిల్లలతో గడిపేందుకు ఇష్టపడతారు. ఇలా పండగలు, ప్రత్యేక రోజుల్లో అటు పిల్లలు, ఇటు పేరెంట్స్ కు సెలవు వచ్చిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. 

అయితే ఈ వీకెండ్ ఇలాంటి సెలవులే రాబోతున్నాయి. సాధారణంగా సాప్ట్ వేర్ ఉద్యోగులు, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసేవారికి శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. అయితే ఈ శనివారం తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థలకు కూడా సెలవు ఉండనుంది. అంటే ఉద్యోగులకు, విద్యార్థులకు రెండ్రోజులు సెలవులు వస్తున్నాయన్నమాట. మరీముఖ్యంగా హైదరాబాద్ లోని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులకు సెలవులు కలిసివచ్చే అవకాశం ఉంది... ఇలాంటి కుటుంబాల్లో ఈ వీకెండ్ చాలా హ్యాపీగా గడిచిపోనుంది. 

23
Ramdan

Ramdan

తెలంగాణలో మార్చి 22, 23 రెండ్రోజులు సెలవేనా? 

కొత్త సంవత్సరం ఆరంభంనుండి విద్యాసంస్థలకు సెలవులే సెలవులు వస్తున్నాయి. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి 1న ప్రారంభమైన సెలవులు సంక్రాంతి, శివరాత్రి, హోలి అంటూ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సెలవు ఈ జాబితాలో చేరిపోయింది... ఇది ఆదివారంతో కలిసిరావడంతో వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోంది. 

ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది... ముస్లింలు ఈ నెలంతా ఉపవాస దీక్షలు చేపడతారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలకు పలు ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మార్చి 21న అంటే ఇవాళ హజ్రత్ అలీ షహదత్ ని పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. ఈ సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం విడుదలచేసిన హాలిడేస్ లిస్ట్ లో మార్చి 21న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. 

అయితే రంజాన్ మాసంలో 21వ రోజున హజ్రత్  అలీ షహదత్ ఉంటుంది. మార్చి 2 న రంజాన్ నెల ప్రారంభమైంది కాబట్టి మార్చి 22న హజ్రత్ అలీ షహదత్ వస్తుంది. కాబట్టి మార్చి 21 ఐచ్చిక సెలవును మార్చి 22కు మార్చింది. మార్చి 23న ఆదివారం సాధారణ సెలవు... ఇలా ఈ వారం వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోంది.

అయితే ఇది కేవలం ఆప్షనల్ హాలిడేనే కాబట్టి రేపు(శనివారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉండదు... కేవలం మైనారిటీ స్కూళ్లు, కాలేజీలకే సెలవు ఉంటుంది. అలాగే ముస్లిం ఉద్యోగులు కూడా ఈరోజు సెలవు తీసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ లోని పాతబస్తీతో పాటు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సెలవు ఉండనుంది. 

33
school holidays

school holidays

వచ్చేవారం లాంగ్ వీకెండ్... నాల్రోజులు సెలవు : 

వచ్చేవారం కూడా తెలంగాణ ఉద్యోగులు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు సెలవులే సెలవులు వస్తున్నాయి. మార్చి 28 రంజాన్ మాసంలో చివరి శుక్రవారం... ఈ రోజును జుమాతుల్ వదా లేదా షబ్-ఎ-ఖదర్ గా జరుపుకుంటారు ముస్లింలు. కాబట్టి ఆరోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 

ఆ తర్వాత మార్చి 29 శనివారం ఒక్కరోజు విద్యాసంస్థలు నడుస్తాయి. ఆ తర్వాత మార్చి 30న ఉగాది. ఆరోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి  సెలవు ఉంటుంది. ఇక మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 1 న కూడా ప్రభుత్వం సెలవు ఇచ్చింది.  ఇలా వచ్చేవారం వరుసగా మూడురోజులు మొత్తంగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. 

ఈ నెల ముగియగానే వచ్చే ఏప్రిల్ నెలలో కూడా భారీ సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1 రంజాన్ తర్వాతిరోజు, ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6 శ్రీరామనవమి, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18 గుడ్ ప్రైడే సాధారణ సెలవులు ఉన్నాయి.  ఇక ఏప్రిల్ 10 మహవీర్ జయంతి, ఏప్రిల్ 14 తమిళ్ న్యూ ఇయర్, ఏప్రిల్ 30 బసవ జయంతి సందర్భంగా ఐచ్చిక సెలవులు ఉన్నాయి. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
హిందూ పండుగలు
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Recommended image2
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
Recommended image3
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved