MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • పాతికేళ్లయినా SLBC ఎందుకు పూర్తి కాలేదు.? అసలు దీని చరిత్ర ఏంటి.? సాకారామైతే లాభాలేంటి.?

పాతికేళ్లయినా SLBC ఎందుకు పూర్తి కాలేదు.? అసలు దీని చరిత్ర ఏంటి.? సాకారామైతే లాభాలేంటి.?

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం యావత్‌ దేశాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. గంటలు రోజులయ్యాయి.. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ మాత్రం ఇంకా కనిపించలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు రెస్క్యూ చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్‌ ఏంటి? దీని లక్ష్యం ఏంటన్న అంశం తెరపైకి వచ్చింది..   

2 Min read
Narender Vaitla
Published : Feb 24 2025, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
SLBC project

SLBC project

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.? 

చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ టన్నెల్‌ పనులను ఇటీవల తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 22 తేదీన ఉదయం 8.20 గంటలకు నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్‌ పైభాగం కుప్పకూలింది. బోరింగ్‌ మిషన్‌ ప్రారంభించిన వెంటనే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో టన్నెల్‌ లోపల మొత్తం 40 మంది కార్మికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన చాలా మంది వెనుదిరిగారు. అయితే 8 మంది మాత్రం సొరంగం లోపల చిక్కుకుపోయారు. 

దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. సింగరేణి రెస్క్యూ టీమ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే టన్నెల్‌లో నీరు, బురద చేరడం వల్ల ఆపరేషన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌లో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.  

ఇప్పటికే దొరకని ఆచూకీ..

అయితే ప్రమాదం జరిగి రెండు రోజులు కావాల్సి వస్తున్నా ఇప్పటికీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచుకీ తెలియకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లోకోట్రైన్‌ రాకపోకలకు టన్నెల్‌లో 9వ కిలోమీటర్ దగ్గర అంతరాయం కలిగింది. ఈ సమస్య పరిష్కారానికి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 11వ కిలోమీటర్‌ నుంచి ఏకంగా 2 కి.మీల మేర భారీగా నీరు, బురద చేరడంతో రెస్క్యూ ఆపరేషన్‌ అత్యంత క్లిష్టంగా మారింది. టన్నెల్‌లో నిలిచిన నీటిని ప్రత్యేక పంపులతో బయటకు పంపిస్తున్నారు. మరో రెండు రోజులు గడిస్తే కానీ లోపల ఉన్న వారి ఆచూకీ తెలిసే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

24
Rescue ops continue at SLBC Tunnel (Photo/@IaSouthern)

Rescue ops continue at SLBC Tunnel (Photo/@IaSouthern)

అసలేంటీ SLBC ప్రాజెక్ట్‌.? 

శ్రీశైలం లిఫ్ట్ బొస్టన్ కెనాల్ (SLBC) ప్రాజెక్ట్.. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ఆధారంగా అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్ట్‌. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను గ్రావిటీ ద్వారా తరలించి మహబూబ్‌నగర్ జిల్లా, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఆలోచన ఇప్పట్లో వచ్చింది కాదు. 1960లో మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి కొరత సమస్యను పరిష్కరించాలనే ఆలోచన మొదలైంది. 

తొలిసారి ఈ ప్రాజెక్టును 1983లో ప్రాతిపాదించారు. కానీ సాంకేతిక, ఆర్థిక కారణాల కారణంగా ఆలస్యమైంది. 1990లో మొదటిసారి ఈ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాల మార్పులు, నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. 2004లో మళ్లీ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నూతన ప్రణాళికలను రూపొందించారు. 
 

34
Collapsed portion of the Srisailam Left Bank Canal (SLBC) tunnel (Photo/ANI)

Collapsed portion of the Srisailam Left Bank Canal (SLBC) tunnel (Photo/ANI)

ఎంత ఖర్చు చేశారు.? 

ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభంలో రూ. 1925 కోట్ల అంచనా వ్యయంతో 2007లో పనులు వేగమయ్యాయి. అయితే కాలక్రమేణా, సాంకేతిక సమస్యలు, వరదలతో పాటు ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్‌ ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. 2017లో ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.3,152.72 కోట్లకు పెరిగింది. తాజాగా ఈ వ్యయాన్ని రూ.4,637 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ కోసం సుమారు రూ. 2646 కోట్లు ఖర్చు చేశారు. 

44
Asianet Image

ప్రాజెక్టుతో జరిగే లాభం ఏంటి.? 

శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు ఆరు నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు.. 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కార్యరూపం దాల్చ లేదు. అయితే తాజాగా అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో టన్నెల్ పనులు తిరిగి ప్రారంభించింది. అయితే అంతలోనే ఇలా అనుకోని ప్రమాదం జరిగింది. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved