మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలదే బాధ్యత: కేటీఆర్

First Published 19, Jul 2019, 5:45 PM

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కొత్త మున్సిపల్ చట్టం ఉపయోగపడుతుందని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ప్రజలకు మేలు చేసే విధంగా కొత్త చట్టం ఉంటుందన్నారు. ఈ చట్టంతో రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు మేలు జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందేలా కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా కేటీఆర్ చెప్పారు. చట్టాలు అమలు కావాలంటే పాలకులకు చిత్తశుద్ది అవసరమన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకు సెల్ప్ అసెస్‌మెంట్ అధికారం కల్పించడం ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. అవినీతికి దూరంగా  ప్రజలకు పాలన అందించేందుకు గాను  తమ ప్రభుత్వం  ఈ కొత్త చట్టాన్ని  రూపొందించినట్టుగా ఆయన చెప్పారు.

మున్సిఫల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  ప్రయత్నించాలని కేటీఆర్ కోరారు. పంచాయితీ రాజ్ చట్టం తరహాలోనే  కొత్త రెవిన్యూ చట్టం రానుందని ఆయన తెలిపారు. కొత్త మున్సిఫల్ చట్టం స్పూర్తి జీహెచ్ఎం‌సీకి కూడ ఉంటుందన్నారు.

మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యతను  ఎమ్మెల్యేలకే అప్పగించినట్టుగా కేటీఆర్ ప్రకటించారు.  కొత్త మున్సిఫల్ చట్టం కారణంగా జిల్లాల కలెక్టర్లకు పని భారం పెరిగే  అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో పరిపాలన వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

loader