TS TET హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఒకవేళ డౌన్లోడ్ కాకుంటే ఏం చేయాలి?
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించేందుకు ప్రిపేర్ అయ్యే ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెలలో టెట్ పరీక్ష నిర్వహించనున్న ప్రభుత్వం హాల్ టికెట్లను జారీ చేసింది.

TS TET Hall Tickets
TS TET : టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ ... ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టే అర్హత టెస్ట్. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ముందుగా టెట్ లో అర్హత సాధించాలి... ఆ తర్వాత డిఎస్సి (డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) ద్వారా స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది రేవంత్ సర్కార్. ఈ పరీక్షలో జాబ్స్ సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి ఉద్యోగాల్లో కూడా చేర్చుకున్నారు.
అయితే ఈ రిక్రూట్ మెంట్ సమయంలోనే మరోసారి భారీగా టీచర్ రిక్రూట్ మెంట్స్ చేపడతామని ప్రకటించారు. అన్నట్లుగానే ఈ ప్రక్రియను ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే మరోసారి TET నిర్వహణకు సిద్దమైంది. వచ్చే నెలలో(జనవరి 2025) జరగనున్న టెట్ పరీక్ష కోసం ఇవాళ(డిసెంబర్ 26,2024) అంటే గురువారం నుండి హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
TS TET Hall Tickets
ts tet Hall Ticket 2025 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?
తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet2024.aptonline.in/ ను ఓపెన్ చేయండి.
Hall Ticket Download Link పై క్లిక్ చేయండి. దీంతో https://tgtet2024.aptonline.in/tstet/HallticketFront కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
అక్కడ జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి proceed నొక్కండి. దీంతో మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. పేరు, ఇతర వివరాలు, ఎగ్జామినేషన్ సెంటర్ తదితర వివరాలు సరిచూసుకొండి.
ఒకవేళ ఏదయినా సాంకేతిక కారణాలతోగానీ, మరేదైనా సమస్య వల్లగానీ హాల్ టికెట్ డౌన్లోడ్ కాకుండా కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే SCERT (State Council of Educational Research and Training) & Ex-officio Director, TET, Hyderabad కార్యాలయాన్ని సందర్శించండి. వర్కింగ్ డే లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటలవరకు సంప్రదించవచ్చు.
TS TET Hall Tickets
టెట్ ఎగ్జామ్ షెడ్యూల్, టైమింగ్ :
జనవరి 2025 లో టెట్ పరీక్ష నిర్వహిస్తోంది తెలంగాణ విద్యాశాఖ. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్ష రాసేందుకు 2,48,172 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి పరీక్ష నిర్వహించనున్నారు.
జనవరి 8,9,10,18 తేదీల్లో టెట్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2,5,11,12,19,20 తేదీల్లో పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష వుంటుంది. ఉదయం 9 గంటల నుండి 11.30 వర మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు రెండో సెషన్ వుంటుంది. అంటే టెట్ అనేది రెండున్నర గంటల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట.