TRS plenary : అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఇతర చిత్రాలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుంది. ఈ ప్లీనరీలో కల్వకుంట్ల, కవిత కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్లీనరీ అంతా గులాబీ మయంగా మారిపోయింది.
TRS plenary1
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహిస్తుననారు. టీఆర్ఎస్ ప్లీనరీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
TRS plenary 2
ఈ ప్లీనరీలో ప్రత్యేక ఆకర్షణగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలిచారు. వీరి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
TRS plenary
ప్లీనరీకి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు, నాయకులుతో సభా ప్రాంగణం అంతా గులాబీ మయంగా మారిపోయింది. దీనికోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు.
TRS plenary
ప్లీనరీకి ముందు తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
TRS plenary
టీఆర్ఎస్ పార్టీ 21 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న వేడుకల్లో.. భాగంగా ఫిల్మాటోగ్రఫీ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్.. కేటీఆర్ కు చిత్రపటాన్ని అందజేశారు.
TRS plenary
ప్లీనరీకి ముందు కేటీఆర్ టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు ప్రారంభించారు.
TRS plenary
టీఆర్ఎస్ భవన్ లో మొదటైన వేడుకల్లో తెలంగాణ తల్తి విగ్రహం ముందు మంత్రి తలసానితో కలిసి ఫొటోలకు ఇలా ఫొజిచ్చారు.
TRS plenary
టీఆర్ఎస్ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రారంభించడంతో అభిమానులు కురిపించిన ప్రేమజల్లులో మునిగిపోతున్న కేటీఆర్.
TRS plenary
ప్లీనరీకి వచ్చిన నాయకులు కేటీఆర్ తో సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు. అలా సెల్పీకి చిక్కిన కేటీఆర్.
TRS plenary
నేడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో జాతీయ రాజకీయాలే కేంద్ర బిందువుగా నిలవనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయడంతో పాటుగా.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్రపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.