తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు...
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హైదరాబాద్తో సహా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప కాలు బయట పెట్టొద్దని చెబుతోంది.
జూలై 25 నుంచి జూలై 27 వరకు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్అలర్ట్ హెచ్చరికలను ఈ మూడు రోజుల పాటు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 40-50కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఈ నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
మంగళవారం నాడు ముఖ్యంగా తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. మిగిలిన జిల్లాల్లో కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
ఇక, హైదరాబాదులో రాత్రి కురిసిన వర్షానికి ఏకడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం పూట మొదలైన వర్షం అరగంట పాటు గట్టిగా కొట్టడంతో రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో తీవ్రభయాందోళనలో జనాలు ఉన్నారు. ఇక బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి, బోనగిరి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు ప్రకటించింది వాతావరణ శాఖ.