MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • TGSRTC: బస్సులో బ్యాగ్ మర్చిపోయారా.? ఈ నెంబర్‌కి ఫోన్‌ చేస్తే చాలు.. మీ బ్యాగ్ సేఫ్

TGSRTC: బస్సులో బ్యాగ్ మర్చిపోయారా.? ఈ నెంబర్‌కి ఫోన్‌ చేస్తే చాలు.. మీ బ్యాగ్ సేఫ్

ఆర్టీసీ బస్సులో చిల్లర మర్చిపోవడం సర్వసాధారణమైన విషయం. టికెట్‌కు సరిపడ చిల్లర ఇవ్వకపోతే కండక్టర్ టికెట్‌పై ఎంత ఇవ్వాలో ఆ అమౌంట్‌ రాసి ఇస్తుంటారు. అయితే కొన్ని కారణాలతో చిల్లర మర్చిపోతుంటాం. అయితే ఈ చిల్లర సమస్యకు ఓ పరిష్కారం ఉందని మీకు తెలుసా.?  

1 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 27 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
bus conductor

bus conductor

రూ. 100 టికెట్‌కు రూ. 500 నోటు ఇస్తాం. కండక్టర్‌ దగ్గర సరిపడ చిల్లర ఉండదు. దీంతో మిగతా రూ. 400ని టికెట్‌ వెనకాల రాసి ఇస్తాడు. అయితే ఏదో ధ్యాసలో పడి చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటాం. అయితే ఏదో 10, 20 అయితే పోనిలే అని వదిలేసుకుంటాం. అమౌంట్‌ ఎక్కువైతే కాస్త ఇబ్బంది అయినా సరే డిపో లేదా బస్టాండ్‌కు వెళ్లి విషయాన్ని తెలియజేస్తాం. ఇలా డబ్బులు తిరిగి పొందడం పెద్ద పనితో కూడుకున్న వ్యవహారం. 

23

అయితే ఆర్టీసీ బస్సులో చిల్లర మర్చిపోతే ఫోన్‌పై ద్వారా మీ డబ్బును రిటర్న్‌ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా.? మీరు సరిగ్గా గమనిస్తే కండక్టర్‌ మీకు ఇచ్చే టికెట్‌పై ఒక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఉంటుంది. 040-69440000 నెంబర్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని తెలపాలి. అనంతరం అధికారులు విచారణ చేపట్టి సదరు టికెట్‌పై పై కండక్టర్‌పై రాసిన మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా ప్రయాణికుడికి చెల్లిస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. 

33
TGSRTC

TGSRTC

అయితే కేవలం చిల్లర మాత్రమే కాకుండా ప్రయాణం సమయంలో బస్సులో విలువైన వస్తువు, బ్యాగులు, సెల్‌ఫోన్లు మర్చిపోయినా హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి సమాచారాన్ని అందించవచ్చు. ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో భోజనం కోసం లేదా టీ కోసం మధ్యలో ఆగి బస్‌ మిస్‌ అయిన సందర్బాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే అదే టికెట్‌పై మరో బస్సులో ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకోవచ్చు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
Recommended image2
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved