MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • తెలంగాణలో రెండో విడత రుణమాఫీ షురూ.. ఎవరి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందంటే?

తెలంగాణలో రెండో విడత రుణమాఫీ షురూ.. ఎవరి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందంటే?

తెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. నేటి (జూలై 30) నుంచి రూ.లక్షన్నర లోపు రైతు రుణాన్ని మాఫీ చేయనున్నారు. కాగా, కుటుంబాన్ని నిర్థారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన అన్యాయం జరగదని స్పష్టం చేసింది.

2 Min read
Author : Galam Venkata Rao
Published : Jul 30 2024, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా జూలై 18న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. దాదాపు 11.50 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో 6 వేల కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలంగాణ రైతు రుణమాఫీ

తెలంగాణ రైతు రుణమాఫీ

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటికే లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు రెండో విడత ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటన మేరకు మంగళవారం (జూలై 30) నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియ మొదలైంది.

36
రెండో విడత రుణమాఫీ

రెండో విడత రుణమాఫీ

ఆగస్టు నెలలోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు కార్యాచరణ కొనసాగుతోంది. లక్షన్నర రూపాయలలోపు ఉన్న రైతుల పంట రుణాన్ని ఈ దఫా మాఫీ చేయనున్నారు. కాగా, రెండో విడతలో జులై 31 కంటే ముందే రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు అవసరమవుతాయి. 

46
రూ.6వేల 93 కోట్లు జమ

రూ.6వేల 93 కోట్లు జమ

ఇప్పటికే తొలి విడత రుణమాఫీ ప్రక్రియ తెలంగాణ వ్యాప్తంగా విజయవంతంగా పూర్తయింది. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేల 93 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, వచ్చే నెల (ఆగస్టు)లో 2 నుంచి 14వ తేదీ వరకు సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి వచ్చిన వెంటనే మూడో విడతగా 2 లక్షల రూపాయల లోపు రైతుల రుణాలకు మాఫీ వర్తింపజేస్తారు. 

56
బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు

బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు

కాగా, జూలై నెలాఖరుకల్లా రూ. లక్షన్నర లోపు రైతు రుణమాఫీ పూర్తి అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నాటికి మొత్తం రెండు లక్షల రూపాయల రుణ బకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించనుంది. ఇది పూర్తయితే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ విజయవంతంగా అమలు చేసినట్లే..

66
రూ. 31 వేల కోట్లు వ్యయం

రూ. 31 వేల కోట్లు వ్యయం

తెలంగాణలో రైతు రుణమాఫీకి మొత్తంగా రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ రుణమాఫీ నిధులను ఇతర ఏ రకమైన అప్పులకు జమ చేయొద్దని బ్యాంకర్లకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పట్టాదారు పాస్‌ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ. 2 లక్షల మేర రుణ మాఫీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించింది. కుటుంబాన్ని నిర్థారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగదని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారు. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Recommended image2
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image3
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved