నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం: బీజేపీ నేతల మధ్య పోటా పోటీ

First Published 6, Oct 2020, 12:10 PM

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి  బీజేపీ నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానంలో గత ఎన్నికల్లో మెరుగైన ఓట్లు రావడంతో ఈ దఫా ఈ స్థానంలో పోటీకి ఆసక్తి  చూపుతున్నారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేయడానికి బీజేపీ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంతో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడ ఎన్నికలు జరగనున్నాయి.హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపనుంది. ఇదే స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ బరిలోకి దిగుతున్నారు.  బీజేపీ కూడ ఈ స్థానం నుండి పోటీకి దిగుతోంది. అయితే ఈ స్థానం నుండి పోటీకి బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆసక్తిగా ఉన్నారు.

2015 ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీజేపీకి  మెరుగైన ఓట్లు వచ్చాయి.దీంతో ఈ స్థానంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆ సమయంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహన్ రావుకు రెండో స్థానంలో నిలిచారు.ఈ మూడు జిల్లాల నుండి టీడీపీ, కాంగ్రెస్  ల నుండి కొందరు నేతలు బీజేపీలో చేరారు.దీంతో బీజేపీ నేతలు ఈ స్థానంలో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు.

మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇ. పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పేరాల శేఖర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, మనోహార్ రెడ్డిలు ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిని చూపుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల పేర్లను బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

పెద్దిరెడ్డికి వరంగల్ జిల్లాతో కూడ సంబంధాలున్నాయి. మంత్రిగా ఆయన పనిచేశారు. విద్యాసంస్థలతో ఆయనకు సంబంధాలు ఉండడంతో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బీజేపీ నాయకత్వాన్ని పెద్దిరెడ్డి కోరినట్టుగా ప్రచారం సాగుతోంది.

loader