MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Telangana: కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు.. ఈ ఇద్దరి మంత్రుల గొడ‌వ ఏంటి అస‌లు.?

Telangana: కాంగ్రెస్‌లో ఆధిప‌త్య పోరు.. ఈ ఇద్దరి మంత్రుల గొడ‌వ ఏంటి అస‌లు.?

Telangana: పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వివాదం అనంతరం మళ్లీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలకు దారి తీసింది. మరి ఆ మంత్రులు ఎవరు.? ఆ అంశం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

2 Min read
Author : Pavithra D
Published : Oct 14 2025, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు
Image Credit : Telangana Govt Twitter

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయి అంతర్గత తగాదాలకు తెరలేపారు. వరంగల్‌ జిల్లాలో తమ ఆధిపత్యం చూపించేందుకు అటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబం, ఇటు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తహతహలాడుతూనే ఉన్నారు. వారు కాకుండా ఇప్పుడు కొత్తగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరావు మధ్య యుద్ధం మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొండా సురేఖ వెర్సస్ పొంగులేటి
Image Credit : Telangana Govt Twitter

కొండా సురేఖ వెర్సస్ పొంగులేటి

శనివారం మంత్రి కొండా సురేఖ.. తోటి కేబినేట్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరావుపై రాష్ట్ర హైకమాండ్‌ను ఫిర్యాదు చేశారు. తమ ఎండోమెంట్స్ శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని.. రూ. 71 కోట్ల టెండర్ ప్రక్రియను తమ తరపువాళ్లకు వచ్చేలా చేశారని ఆరోపించారు మంత్రి సురేఖ. ఈ అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించడమే కాదు.. ఆపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వివరణాత్మక లేఖను పంపించారు మంత్రి సురేఖ.

Related Articles

Related image1
Telangana: త‌గ్గేదేలే.. బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Related image2
Telangana: జూబ్లీహిల్స్ బైపోల్‌లో వారే కీలకం.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.?
35
టెండర్ల లొల్లి
Image Credit : Telangana Govt Twitter

టెండర్ల లొల్లి

ఎండోమెంట్స్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న సురేఖ.. తనకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాసరావు టెండర్లను ఖరారు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు నేరుగా తెలియజేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య గతంలో తలెత్తిన వివాదం పార్టీ జోక్యం ద్వారా సద్దుమణిగిన కొన్ని వారాల తర్వాత మళ్లీ కొత్తగా ఈ వివాదం తలెత్తిన విషయం విదితమే.

45
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌
Image Credit : Telangana Govt Twitter

సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌

తాజా ఎపిసోడ్ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సమన్వయ లోపాన్ని మరోసారి బయటపెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏం చేయనున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

55
ఎవరి వెర్షన్ వారిది..
Image Credit : Telangana Govt Twitter

ఎవరి వెర్షన్ వారిది..

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా తన అధికార పరిధిలోనే మంత్రి వ్యవహరించారని పొంగులేటి శిబిరం చెబుతోంది. అటు సురేఖ మద్దతుదారులు ఆమెకు సీనియారిటీ ఉన్నప్పటికీ ఆమెను పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్య ఇప్పుడు జాతీయ నాయకత్వానికి చేరుకుంది. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Recommended image2
Now Playing
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
Recommended image3
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Related Stories
Recommended image1
Telangana: త‌గ్గేదేలే.. బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Recommended image2
Telangana: జూబ్లీహిల్స్ బైపోల్‌లో వారే కీలకం.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved