Telangana Jobs : 10,956 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు : అర్హతలు, సిలబస్, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి డిటెయిల్స్
భారీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ మేరకు ఏకంగా 10,956 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ ఉద్యోగాలు పొందాలంటే కావాల్సిన అర్హతలు, సిలబస్, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం.

Village Level Officer
Telangana Cabinet Meeting : నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టిన ప్రభుత్వం కొత్తగా మరిన్ని ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. వివిధ విభాగాల్లో 11 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీకి సిద్దమయ్యింది ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణవ్యాప్తంగా రెవెన్యూ గ్రామాలకు 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ (Village Level Officer) పోస్టులను మంజూరుచేసింది రేవంత్ కేబినెట్. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, నియామకానికి సంబంధించిన విధివిధానాలను నోటిఫికేషన్ లోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఇంత భారీస్థాయిలో విలేజ్ లెవల్ ఆఫీసర్ల నియామకం చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. స్వగ్రామంలో ఉంటూనే ఉద్యోగం చేసుకునే అవకాశం యువతకు ఉంటుంది. విద్యార్హతలు కూడా ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైనవే ఉండవచ్చు. ఇలా అన్నిరకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Telangana Jobs Notification 2025
విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టుల అర్హతలు, సిలబస్, ఎంపిక ప్రక్రియ పూర్తి డిటెయిల్స్ :
గ్రామ స్థాయి అధికారులు (VLO) పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత వీటిపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అర్హతలు, సిలబస్, దరఖాస్తు, పరీక్ష... ఇలా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
తెలంగాణ కేబినెట్ ఆమోదం లభించింది కాబట్టి త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఈ VLO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశం ఉంది. అప్పటినుండే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. అయితే అప్పటివరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ తెలుసుకుని ప్రిపేర్ కావాలి... అయితేనే గట్టి పోటీని తట్టుకుని ఈ ఉద్యోగాలను పొందవచ్చు.
విద్యార్హతలను ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన వాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన విద్యాసంస్థల్లో చదివి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 ఏళ్ల నుండి 44 ఏళ్లలోపు ఉండాలి... ఎస్సి,ఎస్టి,బిసి, వికలాంగులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అంతా సరిగ్గా ఉంటే ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారు.
సిలబస్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, భారత రాజకీయాలు, రాజ్యాంగం, దేశంతో పాటు తెలంగాణ హిస్టరీ, దేశ రాష్ట్రాల భౌగోళిక చరిత్ర, దేశంలో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ది, గ్రామస్థాయి పాలన, స్థానికసంస్థల గురించి ఉంటుంది. ఇక లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి.
అయితే నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ, సిలబస్ పై క్లారిటీ వస్తుంది. పైన పేర్కొన్న అంశాల్లో మార్పులు ఉండవచ్చు.కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ అంశాలు కేవలం అవగాహన కోసమే అందిస్తున్నాం.
Telangana Jobs 2025
తెలంగాణ రెవెన్యూ, గురుకుల, న్యాయ శాఖలోనూ ఉద్యోగాల భర్తీ :
తెలంగాణ కేబినెట్ కేవలం విలేజ్ లెవన్ ఆఫీసర్ పోస్టులనే కాదు మరికొన్ని పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతించింది. అంటే ఈ ఉద్యోగాలను కూడా తర్వలోనే భర్తీ చేయనున్నారన్నమాట.
ఇక తెలంగాణవ్యాప్తంగా భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసారు. తాజాగా మరికొన్ని టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో 330 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
న్యాయ వ్యవస్థలో కూడా ఖాళీల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలోని 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.