MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana లో వారి ఖాతాల్లోకి నేరుగా రూ.18 వేలు...మంత్రి కీలక ప్రకటన!

Telangana లో వారి ఖాతాల్లోకి నేరుగా రూ.18 వేలు...మంత్రి కీలక ప్రకటన!

తెలంగాణ చేనేత కార్మికులకు రూ.48.8 కోట్లు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.  రాష్ట్ర చేనేత సేవా కేంద్రం జాతీయ స్థాయిలో పురస్కారం గెలిచినట్లు సమాచారం.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 11 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
నేతన్నకు భరోసా
Image Credit : freepik

నేతన్నకు భరోసా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు గణనీయమైన శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చేతివృత్తులపై ఆధారపడుతున్న నేతన్నల ఆర్థిక భద్రత కోసం తాజాగా రూ. 48.8 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ‘నేతన్నకు భరోసా’ పథకం కింద చేనేత కుటుంబాలకు అందించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మగ్గాలపై పనిచేస్తున్న వారికీ, సహాయంగా ఉన్న అనుబంధ కార్మికులకూ ఈ పథకం ద్వారా మద్దతు లభించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రెండు విడతలుగా
Image Credit : freepik

రెండు విడతలుగా

ఈ ఆర్థిక సాయాన్ని వార్షికంగా రెండు విడతలుగా అందించనున్న ప్రభుత్వం, జియో ట్యాగ్‌ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులే అర్హులని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా, కార్మికులకు సకాలంలో మొత్తం అందేలా చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.

నేతన్నకు భరోసా పథకం కింద, ప్రధాన కార్మికులకు సంవత్సరానికి రూ. 18 వేల చొప్పున, అనుబంధ కార్మికులకు రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు నమోదు ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

37
వ్యక్తిగత రుణ భారం
Image Credit : freepik

వ్యక్తిగత రుణ భారం

ఇక చేనేత కార్మికులపై ఉన్న వడ్డీలతో కూడిన వ్యక్తిగత రుణ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసింది. ఈ రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని తుమ్మల అధికారులకు ఆదేశించారు. దీని ద్వారా చేతివృత్తిని ఆధారంగా జీవిస్తున్న పేద కుటుంబాలపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది.

47
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ
Image Credit : freepik

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ

ప్రత్యేకంగా రాష్ట్రంలో చేనేత విద్య, పరిశోధన అభివృద్ధికి మరో మెట్టుపెట్టింది ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి శాశ్వత భవనాలు నిర్మించనుంది. ఈ టెక్నాలజీ కేంద్రం చేనేత రంగానికి అవసరమైన ఆధునిక విద్యా శిక్షణలతో పాటు పరిశోధనకు కూడా దోహదం చేస్తుంది. దీంతో శిక్షణ పొందిన యువతకు అవకాశాలు పెరుగుతాయని అంచనా.

57
అరుదైన గుర్తింపు
Image Credit : freepik

అరుదైన గుర్తింపు

ఇంతలోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు కూడా దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని దేశంలోని ఉత్తమ ‘ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్‌మెంట్’ విభాగానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించే 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 38 చేనేత సేవా కేంద్రాల పనితీరును సమీక్షించిన తర్వాతే ఈ గుర్తింపు తెలంగాణకు లభించింది. ఈ పురస్కారాన్ని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ అందుకోనున్నారు. తెలంగాణకు ఈ గౌరవం దక్కడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఇది రాష్ట్ర చేనేత కళాకారులకు మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని అభిప్రాయపడ్డారు.

67
చేనేత రంగం
Image Credit : freepik

చేనేత రంగం

తెలంగాణలో చేనేత రంగం స్వతంత్ర భారతంలో ప్రత్యేకతను కలిగిన రంగాలలో ఒకటిగా నిలిచింది. పోచంపల్లి, గద్వాల్, నరాయణపేట వంటి ప్రాంతాల చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అధికంగా మెకానికల్ ఫ్యాబ్రిక్‌ తయారీ పెరిగినప్పటికీ, చేనేత కళాకారుల ప్రాముఖ్యత తగ్గలేదు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్థిక ప్యాకేజీ, విద్యా శిక్షణ,  జాతీయ గుర్తింపు, తెలంగాణలో చేనేత రంగానికి ఒక పునరుత్థానంగా మారే అవకాశం ఉంది. కార్మికులకు స్థిరమైన ఆదాయం అందించి, వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది

77
సంప్రదాయాల పరిరక్షణ
Image Credit : freepik

సంప్రదాయాల పరిరక్షణ

చేనేత రంగం కేవలం సంప్రదాయాల పరిరక్షణ మాత్రమె కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే కీలక వనరు. కేంద్రం నుండి వచ్చిన గౌరవం, రాష్ట్రం చేపట్టిన చర్యలు, కలిసి చేనేత రంగాన్ని పునర్నిర్మించేందుకు దోహదం చేయనున్నాయి. ఆధునికత, సాంకేతికతతో మేళవించిన ఈ రంగం, వచ్చే రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకమైన ఆదాయ వనరుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Telangana Rains : జులై ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే.. మరి సెకండాఫ్ పరిస్ధితేంటి?
Recommended image2
Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజులు దుకాణాలు బంద్...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved