MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజులు దుకాణాలు బంద్...

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజులు దుకాణాలు బంద్...

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా జులై 13 ఉదయం నుంచి 15 వరకు హైదరాబాద్‌లో మద్యం షాపులు మూసేయాలని  సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 11 2025, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మద్యం ప్రియులకు నిరాశ
Image Credit : freepik

మద్యం ప్రియులకు నిరాశ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బోనాల వేడుకలకు సిద్ధమవుతుండగా, మరోవైపు మద్యం ప్రియులకు మాత్రం ఈసారి నిరాశ ఎదురవుతోంది. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు సికింద్రాబాద్ ప్రాంతంలో జులై 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో, రెండు రోజులు అంటే జులై 13 ఉదయం 6 గంటల నుండి జులై 15 ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మద్యం దుకాణాల మూసివేత
Image Credit : freepik

మద్యం దుకాణాల మూసివేత

ఈ ఆదేశాల ప్రకారం, నగరంలోని సెంట్రల్, నార్త్, ఈస్ట్ జోన్‌ల పరిధిలో ఉన్న కీలక పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారంగేట్, మారేడ్‌పల్లి, మహంకాళి, రామ్‌గోపాల్‌పేట, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు రెండు రోజుల పాటు తాత్కాలికంగా మూతపడతాయి.

37
బోనాల ఉత్సవాలు
Image Credit : freepik

బోనాల ఉత్సవాలు

భక్తులు లక్షల సంఖ్యలో బోనాల ఉత్సవానికి హాజరయ్యే నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటమే ఈ నిర్ణయానికి ముఖ్య కారణం. ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే భవిష్య వాణి కార్యక్రమం ఈ పండుగలో అతి ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతుంది. భక్తుల నమ్మకానికి అనుగుణంగా మాతంగి రూపంలో అమ్మవారు స్వర్ణలత పచ్చికుండ మీద నిల్చొని భవిష్యత్తు చెబుతారని విశ్వాసం ఉంది. ఈ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు.

47
ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో
Image Credit : freepik

ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో

హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు సుమారు నెల రోజులపాటు కొనసాగుతాయి. గోల్కొండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో జరిగే వేడుకలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. అందుకే పోలీస్ శాఖ ఇప్పటికే బందోబస్తును కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజుల క్రితమే ప్రత్యేక గస్తీలు మొదలుపెట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్లు, భక్తుల రద్దీ నియంత్రణ, డ్రోన్ల ద్వారా నిఘా వంటి అంశాల్లో అధికారులు పూర్తి స్థాయిలో చురుగ్గా ఉన్నారు.

57
విదేశాల నుండి కూడా...
Image Credit : freepik

విదేశాల నుండి కూడా...

ఈ ఏడాది బోనాల వేడుకలకు విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అధికారులు భద్రత చర్యలు మరింత కఠినంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరం మాత్రమే కాకుండా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుండి కూడా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనుంది

67
కమిషనర్ ఆదేశాలు
Image Credit : freepik

కమిషనర్ ఆదేశాలు

మద్యం షాపుల మూత విషయంలో, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల యజమానులు పోలీస్ కమిషనర్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

77
10,000 మంది పోలీసులను
Image Credit : freepik

10,000 మంది పోలీసులను

బోనాల సందర్భంగా ఆలయాల చుట్టూ బందోబస్తు కోసం అదనంగా పోలీసు సిబ్బందిని  నియమించారు. సికింద్రాబాద్‌లో మాత్రమే దాదాపు 10,000 మంది పోలీసులను రంగంలోకి దించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా పెంచి భద్రతను పటిష్టం చేయనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతోంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Related Stories
Recommended image1
Hyderabad Bonalu : గోల్కొండ కోటలో బోనాల వేడుకలు.. బంగారు బోనమెత్తనున్న కల్వకుంట్ల కవిత
Recommended image2
Bonalu Special: బోనాలకు బెస్ట్ టేస్ట్: ఇలానే చేసుకుంటే మటన్ గ్రేవీ అద్భుత: అనాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved