ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 13 మాసాల తర్వాత రాజ్ భవన్ లో అడుగు పెట్టారు.ఈ మధ్య కాలంలో రాజ్ భవన్ లో జరిగిన ఏ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేదు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
దాదాపు ఏడాది తర్వాత రాజ్ భవన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత నుండి రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు మాత్రమే కేసీఆర్ ఇవాళ రాజ్ భవన్ కు చేరుకున్నారు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
2022 జూన్ 28వ తేదీన హైద్రాబాద్ రాజ్ భవన్ లో ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి తొమ్మిది మాసాల తర్వాత కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత రాజ్ భవన్ లో జరిగిన ఏ కార్యక్రమానికి కూడ కేసీఆర్ హాజరు కాలేదు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
2022 డిసెంబర్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైద్రాబాద్ కు తొలిసారిగా వచ్చారు. అయితే ఆమెకు స్వాగతం పలికే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అయితే అదే రోజు సాయంత్రం రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం వంటి కార్యక్రమాలకు కూడ ఆయన దూరంగా ఉంటున్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కారణంగా కేసీఆర్ రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
ఇటీవలనే హైద్రాబాద్ కు రాష్ట్రపతి వచ్చిన సమయంలో హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు కేసీఆర్, గవర్నర్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో గవర్నర్, కేసీఆర్ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రపతి విమానం వచ్చేవరకు వీరిద్దరూ మాట్లాడుకుంటూ కన్పించారు.
ఏడాది తర్వాత రాజ్‌భవన్‌కు కేసీఆర్: నాడు ఉజ్జల్ భుయాన్, నేడు ఆరాధే ప్రమాణానికి హాజరు
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించలేదని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని సుప్రీంకోర్టును కూడ కేసీఆర్ సర్కార్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.