MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణలో వర్షాలు, వరదలపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు.. అప్రమత్తంగా అధికారులు, రెస్క్యూ సిబ్బంది..

తెలంగాణలో వర్షాలు, వరదలపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు.. అప్రమత్తంగా అధికారులు, రెస్క్యూ సిబ్బంది..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో.. వరదల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టుగా.. దీనికి సంబంధించి స్పెషల్ కమీషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

2 Min read
Author : Bukka Sumabala
| Updated : Jul 27 2023, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హైదరాబాద్ :  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందుల తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్,డీ.ఆర్.ఎఫ్, ఫైర్ తదితర శాఖల ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే సచివాలయంలో వర్షాలు, వరద పరిస్థితులు, సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

39

ఈ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ అధికారులును నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్ లో 7997950008 , 7997959782, 040 - 23450779 అనే నెంబర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగూడెం, హైదరాబాద్ లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ములుగు, వరంగల్ లో ఒక్కొక్క బృందం ఉందని తెలిపారు.   

49

రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో గత రాత్రి నుండి కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీ మీటర్ల నుండి 40 సెంటి మీటర్ల వరకు వర్షం కురిసిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉప్పొంగడం వల్ల మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిందని, ఈ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని అన్నారు. 

59

మోరంచపల్లి గ్రామానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని, రక్షణ, పునరావాస చర్యలకు సహకరించేందుకు హెలికాఫ్టర్ కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భూపాల పల్లి జిల్లా కలెక్టర్, ఎస్.పి లు మోరంచపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

69

అదేవిధంగా, ములుగు జిల్లా ముత్యాల ధారా జలపాతంలో చిక్కుకు పోయిన 80 మంది పర్యాటకులను రాత్రి వంటి గంట ప్రాంతంలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో నీరు చేరడంతో అక్కడి పిల్లలను ఇతర పాఠశాలలకు తరలిస్తున్నట్టు తెలిపారు. 

79

వరంగల్. హన్మకొండ పట్టణాలలో భారీ వర్షాల వల్ల అనేక కాలనీలు, బస్తీలు నీట మునిగాయని, ఈ బస్తీలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలియ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదీ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రెండవ ప్రమాద సూచిక జరీ చేశామని, మూడవ ప్రమాద సూచీని ఎప్పుడైనా ప్రకటించే అవకాశమున్నందున, ముంపుకు గురయ్యే గ్రాలనుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. 

89

కడెం ప్రాజెక్ట్ ద్వారా అధిక పరిమాణంలో జలాలు విడుదల అవుతున్నందున అక్కడి పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సి.ఎస్ వెల్లడించారు. 
అన్ని జిల్లాల కలెక్టర్ల, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో ప్రతీ గంట గంటకు పరిస్థితులను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపారు. 

99
musi floods

musi floods

ఇప్పటికే నిండి మత్తడి పోస్తున్న చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక చర్యలను చేపట్టామని, కాల్వలు, కాజ్ వేల గుండా ప్రయాణం సాగించవద్దని ప్రజలకు సూచించారు. సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్.ఓ.డి లు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారని వివరించారు. 

About the Author

BS
Bukka Sumabala
తెలంగాణ
 
1st ODI • NZ vs IND 2026
Innings Break
NZNZ
185
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
ఇక్క‌డ 365 రోజులూ డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
Recommended image3
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved