- Home
- Telangana
- Bank Holidays : తెలంగాణ ప్రజలారా... మీకు డబ్బుల పనుంటే సెప్టెంబర్ 5, 22, 30 తేదీలను గుర్తుపెట్టుకొండి
Bank Holidays : తెలంగాణ ప్రజలారా... మీకు డబ్బుల పనుంటే సెప్టెంబర్ 5, 22, 30 తేదీలను గుర్తుపెట్టుకొండి
మీరు తెలంగాణలో ఉంటున్నారా? మీకు సెప్టెంబర్ లో బ్యాంకులో పనుందా? అయితే సెప్టెంబర్ 5, 22, 30 తేదీలను గుర్తుపెట్టుకొండి. ఎందుకో తెలుసా?

సెప్టెంబర్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు
డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినా, మొబైల్‌లోనే అన్నిరకాల ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నా.. కొన్ని పనులకు ఇంకా బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రతిపనికి కాకపోయినా కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రం బ్యాంకులోనే జరపాల్సి ఉంటుంది. ఇలా చాలామందికి నెలలో కనీసం ఒకటి రెండుసార్లయినా బ్యాంకులకు వెళ్లే పని ఉంటుంది.
అయితే ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది... అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... కొన్ని జిల్లాల్లో ఈ కుండపోత వానల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాలయాలు, ఉద్యోగులకే కాదు బ్యాంకులకు కూడా సెలవులు వస్తున్నాయి. కాబట్టి మీకు వచ్చె నెల సెప్టెంబర్ లో బ్యాంకుకు వెళ్లాల్సిన పనివుంటే ముందుగానే ఎన్నిరోజులు సెలవులు ఉన్నాయో చూసుకోండి. తెలంగాణతో సహా దేశంలోని వివిధ బ్యాంకుల సెలవుల జాబితా ఇక్కడ ఉంది. మీ బ్యాంక్ ఏదో చూసుకుని, సెలవుల గురించి తెలుసుకోండి.
సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా 15 రోజులు సెలవులే
దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవులను పరిశీలిస్తే... ఈద్ మిలాద్ తో పాటు వివిధ పండగలకు సెలవులున్నాయి. ఇలా మొత్తం నెలలో 30 రోజులుంటే 15 రోజులు బ్యాంకులకు సెలవులే ఉన్నాయి... ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కో రాష్ట్రానికి కొన్ని సెలవులే వర్తిస్తాయి కాబట్టి ప్రతిరాష్ట్రంలో 15 రోజులు సెలవులుండే అవకాశం లేదు.
బ్యాంకులకు ఏరోజు ఎందుకు సెలవు?
సెప్టెంబర్ 3 : కర్మ పూజ , జార్ఖండ్ లో సెలవు
సెప్టెంబర్ 4 : ఓనమ్ పండగ, కేరళలో సెలవు
సెప్టెంబర్ 5 : ఈద్ ఇ మిలాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా చాలారాష్ట్రాల్లో సెలవు ఉంది.
సెప్టెంబర్ 6 : ఈద్ ఇ మిలాద్, ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, చత్తీస్ ఘడ్ లో సెలవు
సెప్టెంబర్ 7 : ఆదివారం
సెప్టెంబర్ 12 : ఈద్ ఇ మిలాద్ తర్వాతి వారం సందర్భంగా జమ్ము, శ్రీనగర్ సెలవు
సెప్టెంబర్ 13 : రెండో శనివారం, అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 14 : ఆదివారం
సెప్టెంబర్ 21 : ఆదివారం
సెప్టెంబర్ 22 : బతుకమ్మ ప్రారంభం సందర్భంగా తెలంగాణ, నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్ లో సెలవు
సెప్టెంబర్ 23 : మహరాజ్ హరిసింగ్ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనర్ లో సెలవు
సెప్టెంబర్ 27 : నాలుగో శనివారం
సెప్టెంబర్ 28 : ఆదివారం
సెప్టెంబర్ 29 : మహాసప్తమి, దుర్గాపూజ సందర్భంగా అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో సెలవు
సెప్టెంబర్ 30 : దుర్గాష్టమి, తెలంగాణ, ఏపీ సహా చాలారాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ లో తెలంగాణ బ్యాంకులకు ఎన్నిరోజుల సెలవులు?
తెలంగాణ విషయానికి వస్తే, శని, ఆదివారాలు కాకుండా సెప్టెంబర్ 5న ఈద్ మిలాద్, సెప్టెంబర్ 22న బతుకమ్మ మొదటిరోజు, సెప్టెంబర్ 30న దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే 2, 4వ శనివారాలు, అన్ని ఆదివారాలతో పాటు మరో మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి… మొత్తంగా నెెలలో తొమ్మిదిరోజుల సెలవులు వస్తున్నాయి.
సెప్టెంబర్‌లో తెలంగాణలో బ్యాంకు సెలవులు
సెప్టెంబర్ 5, శుక్రవారం: ఈద్ మిలాద్
సెప్టెంబర్ 7: ఆదివారం
సెప్టెంబర్ 13: రెండో శనివారం
సెప్టెంబర్ 14: ఆదివారం
సెప్టెంబర్ 21: ఆదివారం
సెప్టెంబర్ 22 : సోమవారం (బతుకమ్మ మొదటిరోజు)
సెప్టెంబర్ 27: నాలుగో శనివారం
సెప్టెంబర్ 28: ఆదివారం
సెప్టెంబర్ 30 : మంగళవారం (దుర్గాష్టమి)
బ్యాంకులకు సెలవులున్నా చింతలేదు..
బ్యాంకులకు సెలవులున్నా ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం ఉండదు. అవి యధావిధిగా జరుగుతాయి. డబ్బులు తీసుకోవడానికి ATMలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. డిమాండ్ డ్రాఫ్ట్, డబ్బులు జమ చేయడం, RTGS, దరఖాస్తులు వంటి పనులకు బ్యాంకుకు వెళ్లేవారు సెప్టెంబర్ 5, 22, 30 తేదీలను గుర్తుంచుకోవాలి.