School Holidays : జనవరి 28 మంగళవారం... తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
తెలంగాణలో రేపు విద్యాసంస్థలకు మరో సెలవు వస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి భారీగా సెలవులు రాగా ఇప్పుడు నెలాకరులో ఈ సెలవు వస్తోంది. అయితే ఈ హాలిడే ఎందుకు వస్తోంది? ఏ విద్యార్థులకు వస్తుందో తెలుసా?

school holidays
School Holidays : ఇప్పటికే ఈ నెలలో భారీగా సెలవులు వచ్చాయి. న్యూ ఇయర్ మొదలు సంక్రాంతి వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. ఇలా జనవరి మొత్తం హాలిడేస్ తో గడిచింది... ఇప్పుడు నెల చివరకు చేరుకున్నాం. మరో నాలుగైదు రోజుల్లో ఈ నెల ముగుస్తుండగా ఇందులోనూ మరో సెలవు వచ్చింది. రేపు అంటే మంగళవారం తెలంగాణలోని పలు విద్యాసంస్థలకు సెలవు రానుంది.
జనవరి 28న ముస్లింల పవిత్ర పండగ షబ్-ఇ-మెరాజ్. ఈ రోజు విద్యాసంస్థలకు ఐచ్చిక సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు రేపు సెలవు వుంటుంది. అయితే మిగతా విద్యాసంస్థలకు సెలవు వుండదు... ప్రైవేట్ విద్యాసంస్థల సెలవు ఆ యాజమాన్యం నిర్ణయంపై ఆధారపడి వుంటుంది.
school holidays
హైదరాబాద్ లో విద్యాసంస్థలకు సెలవు :
షబ్-ఇ-మేరాజ్ సందర్భంగా ప్రకటించిన ఐచ్చిక సెలవు ప్రభావం హైదరాబాద్ పై ఎక్కువగా వుంటుంది. ఇక్కడే అత్యధిక స్కూళ్లు, కాలేజీలు ఆ ప్రత్యేక పండగ సందర్భంగా మూతపడనున్నాయి. మరీముఖ్యంగా పాలబస్తీలోని విద్యాసంస్థలు ఈ సెలవును తప్పకుండా పాటించనున్నాయి.
ఇక తెలంగాణవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం మైనారిటీ స్కూళ్లు, గురుకులాలు కొనసాగుతున్నాయి... అక్కడ చదివే విద్యార్థులకు కూడా రేపు సెలవు వుంటుంది. ముస్లిం విద్యార్థులు ఎక్కువగా వుండే స్కూళ్లు కూడా రేపు ఐచ్చిక సెలవును ఉపయోగించుకుంటాయి.
జనవరి 28న షబ్-ఇ-బరాత్ వేడుకలను ముస్లిం విద్యార్థులు కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు రేవంత్ సర్కార్ ఐచ్చిక సెలవు ప్రకటించింది. దీంతో ఇప్పటికే సెలవులతో నిండిపోయిన జనవరిలో ఫినిషింగ్ టచ్ గా ఈ సెలవు వచ్చింది. విద్యార్థులు ఈ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని రేవంత్ సర్కార్ కోరుకుంటోంది... అందుకే సెలవు ఇచ్చింది. .
ఆ ఉద్యోగులకు కూడా రేపు సెలవు :
తెలంగాణలో పనిచేసే ముస్లిం మైనారిటీ ఉద్యోగులకు కూడా రేపు(మంగళవారం) సెలవు వుంటుంది. ముఖ్యంగా మైనారిటీ శాఖ పరిధిలో పనిచేసే కార్యాలయాల్లో ఉద్యోగులకు ఈ ఐచ్చిక సెలవు వర్తిస్తుంది. ఇక మిగతా ప్రభుత్వ శాఖల్లోని ముస్లిం ఉద్యోగులు కూడా ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు.
ముస్లిం మైనారిటీ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ సంస్థలు కూడా జనవరి 28, 2025న షబ్-ఇ-మెరాజ్ సందర్భంగా తమ ఉద్యోగులకు సెలవు ఇస్తున్నాయి. ఇలా ముస్లిం మైనారిటీ స్కూళ్ళు, కాలేజీలకు కాదు కార్యాలయాలకు రేపు షబ్-ఇ-మెరాజ్ సందర్భంగా సెలవు వస్తోంది. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మసీదులు, ముస్లింలు ఎక్కువగా వుండే ప్రాంతాలు కోలాహలంగా మారనున్నాయి.
షబ్-ఇ-మెరాజ్ ప్రత్యేకత ఏమిటి?
మంగళవారం షబ్-ఇ-మెరాజ్ వేడుకల కోసం ముస్లింలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ముస్లింలు అత్యధికంగా నివాసముండే పాతబస్తీ ప్రాంతం పండగశోభను సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున ప్రార్థన చేస్తే ఆ అల్లా పాపపరిహారం చేస్తాడని ముస్లింల నమ్మకం. అందుకే దీన్ని 'క్షమాపణ రాత్రి' అని కూడా అంటారు... ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు.
షబ్-ఇ-మెరాజ్ సందర్భంగా కొందరు తమ పాపపరిహారం కోసమే కాదు కుటుంబసభ్యుల కోసం కూడా ప్రార్థనలు చేస్తారు. ఈ రోజు ఆ అల్లా స్వర్గం నుండి దిగివచ్చి మనస్పూర్తిగా ప్రార్థన చేసేవారి మొర ఆలకిస్తాడని నమ్ముతారు. అందువల్లే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో వున్నా, ఇతర సమస్యలున్నా వాటినుండి బయటపడేయాలని కోరతారు. భవిష్యత్ బాగుండాలనే... మీ దయ ఎప్పుడూ తమపై వుండాలని అల్లాను వేడుకుంటారు.
ఈ షబ్-ఇ-మెరాజ్ వేడుకలను ఇండియాలోనే కాదు ఇంకా చాలా దేశాల్లో జరుపుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, టర్కీతో పాటు మధ్య ఆసియా దేశాలైన ఉజ్జెకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, కిర్గిస్తాన్ వంటి దేశాల్లో కూడా జరుపుకుంటారు.