MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?

Muharram Holiday 2026 : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొహర్రం పండక్కి అధికారిక సెలవు ప్రకటించాయి. కానీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు రేపు (శుక్రవారం) సెలవు ఇవ్వడంలేవు. మరి మీ పిల్లలకు సెలవుందో లేదో తెలిసేదెలా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 25 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా?
Image Credit : Getty

మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా?

School Holidays : హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండగ మొహర్రం. ముఖ్యంగా తెలుగు పల్లెల్లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు... పీర్ల ఊరేగింపు వైభవంగా సాగుతుంది. అందుకోసమే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొహర్రం పండక్కి రెండ్రోజుల సెలవులు ప్రకటించాయి... ఇందులో ఒకటి ఆప్షనల్ అయితే ఇంకోటి సాధారణ సెలవు. 

ఇవాళ (జూన్ 25, గురువారం) ఐచ్చిక సెలవు ముగిసింది... రేపు (జూన్ 26, శుక్రవారం) సాధారణ సెలవు ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఉద్యోగులకే కాదు విద్యార్థులకు అధికారికంగా సెలవు ప్రకటించాయి. అయినప్పటికి తమ పిల్లలు చదివే స్కూల్ కి సెలవుందా, లేదా? అనే కన్ఫ్యూజన్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీ ఫోన్ కి మేసేజ్ వస్తే క్లారిటీ వచ్చినట్లే...
Image Credit : Getty

మీ ఫోన్ కి మేసేజ్ వస్తే క్లారిటీ వచ్చినట్లే...

మొహర్రం పండక్కి ప్రభుత్వమే అధికారిక సెలవు ప్రకటించింది... కాబట్టి రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ శుక్రవారం (జూన్ 26) మూతపడనున్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్స్ విషయంలోనే గందరగోళం నెలకొంది... కొన్ని విద్యాసంస్థలు సెలవు ఇస్తే మరికొన్ని యధావిధిగా నడిపించనున్నట్లు ప్రకటించాయి. ఇలా ఏ స్కూల్ కి సెలవుంది? ఏ స్కూల్ సెలవు ఇవ్వడం లేదు? అనేది తెలియక పేరెంట్స్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.

అయితే ఇప్పటికే ప్రైవేట్ విద్యాసంస్థలు పేరెంట్స్ ఫోన్లకు మెసేజ్ లు పంపించాయి. కొన్ని మొహర్రం సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు పంపిస్తే మరికొన్ని స్కూల్స్ ఎలాంటి సెలవు ఉండదని తేల్చేస్తూ మెసేజ్ లు పంపించాయి. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ నుండి మీకు కూడా మెసేజ్ వచ్చివుంటుంది... సెలవుపై క్లారిటీ కోసం మెసేజ్ లిస్ట్ పరిశీలించండి. ఎలాంటి మెసేజ్ రాకుంటే వెంటనే స్కూల్ కి కాల్ చేసి క్లారిటీ పొందండి.

34
ఉద్యోగులకు వరుస సెలవులు..
Image Credit : Gemini AI

ఉద్యోగులకు వరుస సెలవులు..

విద్యార్థుల సంగతి పక్కనబెడితే తెలుగు ఉద్యోగులకు మాత్రం మొహర్రం సెలవు పక్కా. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ సెలవు వర్తిస్తుంది. ఇంకో బంపర్ ఆఫర్ ఏమిటంటే ఏపీ, తెలంగాణలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ (జూన్ 25) న కూడా ఐచ్చిక సెలవు పొందారు. అంటే ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు అన్నమాట.

కొందరు ప్రైవేట్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ మొహర్రం సెలవు కలిసివస్తోంది. వీరికి ప్రతి వీకెండ్ శని, ఆదివారం రెండ్రోజులు సెలవే... వీటితో కలిసివస్తోంది ఈ మొహర్రం సెలవు. అంటే జూన్ 26,27,28 మూడ్రోజులు సెలవు వస్తోందన్నమాట... వీరికి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.

44
ఈ మూడ్రోజులు బ్యాంకులకు సెలవే...
Image Credit : ChatGPT

ఈ మూడ్రోజులు బ్యాంకులకు సెలవే...

బ్యాంక్ ఉద్యోగులు ఎగిరిగంతేసేలా వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి. జూన్ 26న అంటే రేపు మొహర్రం సందర్భంగా తెెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు సెలవుంది. తర్వాతిరోజు అంటే జూన్ 27న నాలుగో శనివారం కాబట్టి సెలవే... ఆ తర్వాత జూన్ 28 ఆదివారం సాధారణ సెలవే. ఇలా వరుసగా మూడు రోజుల సెలవులు కలిసి వస్తున్నాయి. ఈ వరుస సెలవులతో బ్యాంకుల్లో పని ఉన్నవారు కాస్త ఇబ్బందిపడే అవకాశాలున్నాయి. అయితే యూపిఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు యదావిధిగా సాగుతాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Voter Registration Drive: ఓటర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి
Recommended image2
Weather Update: అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ఎంట్రీతో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Recommended image3
డీమార్ట్‌లు, మెట్రోలే కాదు.. హైద‌రాబాద్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కు స‌రుకులు దొరికే మార్కెట్లు ఇవే
Related Stories
Recommended image1
Bank Holidays : వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు సెలవు అంటే?
Recommended image2
Muharram: కర్బలా విషాదం ఎలా జరిగింది.. ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved