Holidays : ఒకటి రెండ్రోజులు కాదు గురూ.. వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్ రెడీ
Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరిగంతేసే సమాచారమిది. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా నాలుగురోజులు సెలవులు రాబోతున్నాయి… వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారబోతోంది.

జూన్ 2026 లో సెలవులే సెలవులు..
School Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ముగిశాయి... విద్యార్థులు స్కూళ్ల బాట పట్టారు. ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు అంటే దాదాపు రెండు నెలలపాటు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి... దీంతో చాలామంది నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి ఎంజాయ్ చేశారు. ఎండలు మండిపోతున్నా సరదాగా గడిపారు. అయితే ఇప్పుడు ఎండల తీవ్రత తగ్గినా స్కూళ్లు ప్రారంభం కావడంతో వారి ఆనందం ఆవిరవుతోంది... ఉసూరుమంటు స్కూల్ బ్యాగు భుజాన తగిలించుకుంటున్నారు.
అయితే వేసవి సెలవులు ముగిశాయని బాధపడుతున్న విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్... ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో అలా హాలిడేస్ వస్తున్నాయి. రేపు, ఎల్లుండి స్కూళ్లకి ఎందుకు సెలవులున్నాయి? వచ్చేవారం వరుసగా నాల్రోజులు సెలవులు ఎందుకు వస్తున్నాయి? తెలుసుకుందాం.
జూన్ 12, 13, 14 సెలవులే...
తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. జూన్ 11నే సెలవులు ముగియాల్సింది... జూన్ 12న అంటే ఇవాళ విద్యాసంస్థలన్ని తెరుచుకోవాలి. అయితే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు జూన్ 14 వరకు సెలవులు పొడిగించింది ప్రభుత్వం. జూన్ 15 (సోమవారం) తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాస్థలు పున:ప్రారంభం కానున్నాయి. ఎక్స్ట్రాగా (జూన్ 12,13,14) మూడ్రోజుల సెలవులు కలిసివచ్చాయి.
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇవాళే తెరుచుకున్నాయి. ఇలాంటి స్కూళ్లకు రేపు, ఎల్లుండి (రెండో శనివారం, ఆదివారం) సెలవులున్నాయి. ఇలా వేసవి సెలవులు ముగిసి స్కూళ్ళు ప్రారంభం అయ్యాయోలేదో అలా మళ్లీ సెలవులు వస్తున్నాయి. సోమవారం నుండి పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకుంటాయి... కొత్త తరగతులు ప్రారంభం అవుతాయి.
ఏపీలో రెండ్రోజులు సెలవులే...
తెలంగాణలో మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్ లో వేసవి సెలవుల పొడిగింపు జరగలేదు.. అంటే ఇవాళే (జూన్ 12న) అన్ని విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే ఈ ఒక్కరోజు స్కూళ్లు నడిచేది... మళ్లీ వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం సెలవులున్నాయి. వీకెండ్ సెలవులు ముగిశాక తిరిగి జూన్ 15న (సోమవారం) విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
జూన్ 25 నుండి 28 వరకు నాల్రోజులు సెలవులే..
జూన్ నెలలో విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు వస్తున్నాయి. ఈ నెలాఖరులో 25 నుండి 28 వరకు అంటే నాల్రోజులు తెలంగాణ ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. జూన్ 25న (గురువారం) 9th మొహర్రం (1446H) సందర్భంగా ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అవసరం అనుకుంటే ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇక జూన్
26న (శుక్రవారం) మొహర్రం సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ సెలవు ఉంది. ఇక కొందరు ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది… కాబట్టి యధావిధిగా సెలవు వస్తుంది. ఇలా వచ్చేవారం ఉద్యోగులకు నాల్రోజుల సెలవులు వస్తున్నాయి… వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.
తెలంగాణలోని కొందరు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కూడా 3 రోజులు సెలవులు వస్తాయి. జూన్ 26న మొహర్రం పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవుంది. కొన్ని స్కూళ్లకి ప్రతి శని, ఆదివారం సెలవే. కాబట్టి మూడ్రోజుల సెలవులు కలిసివస్తాయి.

