రోడ్డెక్కిన ఆర్టీసి బస్సులు... అయినా ప్రయాణాలకు దూరంగానే ప్రజలు

First Published 19, May 2020, 10:36 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసి బస్సులు రోడ్డెక్కాయి.

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో దాదాపు రెండు నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ సిటీ బస్సులు మినహా అన్ని సర్వీసులు నేటి(మంగళవారం)నుండి ప్రారంభమయ్యాయి. ఇక అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు ప్రభుత్వ అనుమతులు రావడంతో ఇవాళ ఉదయం నుండే అన్ని ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇన్నాళ్లు డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆర్టీసి అధికారులు తగిన జాగ్రత్తలు  తీసుకుంటూ బస్సులను ఆర్టీసీ అధికారులు అన్ని రూట్లలో నడిపిస్తున్నారు.

అయితే ఉదయమే బస్సు సర్వీసులు ప్రారంభమైనా బస్టాండుల్లో, బస్సులు ప్రయాణికులు లేక వెలవెల బోతున్నాయి. దాదాపు అన్ని రూట్లలో వెళ్తున్న బస్సులు పూర్తిగా ఖాళీగా వెళ్తున్నాయి. ప్రయాణికులు ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రయాణికులు లేకపోవడంతో జగిత్యాల జిల్లాలో ఇవాళ కేవలం 40 బస్సులను మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసి అధికారులు తెలపడం పరిస్థితిని అద్దం పడుతుంది.

బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ లకు డిపోలలో, ప్రయాణికులకు బస్ స్టాండ్ లలో హ్యాండ్ వాష్ చేసుకునే  ఏర్పాట్లు చేశారు అధికారులు. అలాగే డ్రైవర్, కండక్టర్ తో పాటు బస్సులో ప్రయాణించేవారు భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరిస్తేనే బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక జిల్లాల నుండి హైదరాబాద్ కు కూడా బస్సులు ప్రయాణిస్తున్నాయి. అయితే బస్సులను ఎంజీబిఎస్ బస్టాండ్ కు కాకుండా జూబ్లీ బస్ స్టాండ్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఎంజీబిఎస్ పరిసర ప్రాంతాల్లో కరోనా ప్రభావం వుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గినతర్వాత సిటీ బస్సు సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు ఆర్టీసి అధికారులు వెల్లడించారు.

loader