- Home
- Telangana
- పాలకుర్తిపై రేవంత్ ఫోకస్.. ఎర్రబెల్లి దయాకర్‌పై బరిలోకి కొండా మురళి!.. ఆ దిశగా ప్లాన్స్..
పాలకుర్తిపై రేవంత్ ఫోకస్.. ఎర్రబెల్లి దయాకర్‌పై బరిలోకి కొండా మురళి!.. ఆ దిశగా ప్లాన్స్..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. వరంగల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బహిరంగ సభ తర్వాత టీ కాంగ్రెస్‌లో జోష్ నింపింది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి తనదైన వ్యుహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టు ఉన్న స్థానాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. వరంగల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బహిరంగ సభ తర్వాత టీ కాంగ్రెస్‌లో జోష్ నింపింది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి తనదైన వ్యుహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టు ఉన్న స్థానాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌పై కొండా మురళిని రంగంలో దింపేలా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతుంది. ఎర్రబెల్లి, కొండా మురళిలు.. 1991 వరకు రాజకీయాలలో పరస్పరం సహకరించుకునే స్నేహితులు. ఆ తర్వాత విడిపోయి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో బద్ద ప్రత్యర్థులుగా మారి సంగతి తెలిసిందే.
ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించటం కోసం బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి రాజకీయంగా బద్ధ శత్రువు అయిన కొండా మురళిని పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Konda surekha
పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. కొండా మురళి సామాజికవర్గం మున్నూరుకాపు, ఆయన భార్య కొండా సురేఖ సామాజిక వర్గం పద్మాశాలి. ఇద్దరూ బీసీ నేతలే కావడంతో మురళి బరిలోకి దిగితే రెండు వర్గాలకు చెందిన ఓట్లు మురళికి దక్కే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో పాలకుర్తి నుంచి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన Janga Ragavareddy ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయనను కాదని.. అక్కడి నుంచి కొండా మురళిని బరిలో దింపాలని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జంగా రాఘవరెడ్డి.. కొండ మురళి శిష్యుడు కావడంతో ఈ నిర్ణయంలో పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు.
రాజకీయ ప్రత్యర్దులయిన ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా మురళిలు.. ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నిల్లో తలపడిన దాఖలాలు కూడా లేవు. అయితే వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కొండా మురళిని బరిలో దింపడం ద్వారా.. ఎర్రబెల్లికి చెక్ పెట్టవచ్చని భావిస్తున్న ఇప్పటికే ప్రణాళికను సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది.
జూన్ 10వ తేదీన పాలకుర్తిలో టీ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తుందని.. ఆ సభ ద్వారా కొండా మురళి పాలకుర్తిలో ఎంట్రీ ఇస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంపై కొండా మురళి దృష్టి సారించారని చెబుతున్నారు. ఆయన అనుచరులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.
కొండా మురళి పాలకుర్తి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన పక్షంలో.. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడి నుంచే మరోసారి బరిలో నిలిస్తే.. పోరు హోరాహోరి గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది.