MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఫోర్త్‌ వండర్‌గా రామోజీఫిల్మ్‌సిటీ : రేవంత్‌రెడ్డి

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఫోర్త్‌ వండర్‌గా రామోజీఫిల్మ్‌సిటీ : రేవంత్‌రెడ్డి

Ramoji Excellence Awards : రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల వేడుకలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి లు ఒకే వేదికపై కనిపించారు. పలువురు ప్రముఖులు రామోజీ సేవలను గుర్తుచేసుకున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 16 2025, 11:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల వేదికపై చంద్రబాబు, రేవంత్
Image Credit : X/revanth_anumula

రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల వేదికపై చంద్రబాబు, రేవంత్

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్‌’ జాతీయ అవార్డుల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్‌ వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడి అతిథులను ఆకర్షించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రజల పక్షాన నిలిచిన రామోజీ: చంద్రబాబు నివాళి
Image Credit : X/JaiTDP

ప్రజల పక్షాన నిలిచిన రామోజీ: చంద్రబాబు నివాళి

ప్రదానోత్సవ వేడుకలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రామోజీరావును “ప్రజల కోసం పోరాడిన అక్షరయోధుడు”గా అభివర్ణించారు. తన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడని వ్యక్తిగా ఆయనను గుర్తుచేశారు. జర్నలిజం నుండి గ్రామీణాభివృద్ధి, మానవసేవ, మహిళా సాధికారత వంటి విభాగాల్లో అవార్డులు ఇవ్వడం సమాజానికి శక్తినిచ్చే పనిగా అభివర్ణించారు.

అలాగే, “ఈనాడు అనే పత్రిక ద్వారా ప్రజలను సామాజిక బాధ్యతల్లో భాగస్వాములను చేసిన నాయకత్వం రామోజీదే. విపత్తు వచ్చిన ప్రతిసారి స్వంత వనరులతో సేవలందించారు. తెలుగు భాష సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటా” అని చంద్రబాబు వెల్లడించారు.

Related Articles

Related image1
మహేష్ బాబు వారణాసి స్టోరీ ఏంటో తెలుసా?
Related image2
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
35
రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణకు నాలుగో వండర్ : రేవంత్ రెడ్డి ప్రశంసలు
Image Credit : X/revanth_anumula

రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణకు నాలుగో వండర్ : రేవంత్ రెడ్డి ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో రామోజీ ఫిల్మ్‌సిటిని రాష్ట్రానికి నాలుగో వండర్‌గా అభివర్ణించారు. ఛార్మినార్‌, గోల్కొండ, హైటెక్‌ సిటీ తరువాత రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిందని అన్నారు.

“రోజు ఎన్ని పత్రికలు వచ్చినా, నిజం తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. రాత్రి 9 గంటల ఈటీవీ వార్తలు తప్పకుండా చూస్తా” అని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు శ్రమించి, అనేక రంగాల్లో నంబర్‌వన్‌గా రామోజీ నిలిచారని అన్నారు.

45
గవర్నర్‌, జస్టిస్ రమణ, వేంకయ్యనాయుడు అభినందనలు
Image Credit : X/revanth_anumula

గవర్నర్‌, జస్టిస్ రమణ, వేంకయ్యనాయుడు అభినందనలు

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, రామోజీ పేరిట ఏడు అవార్డులు ఇవ్వడం సమాజానికి ప్రేరణ అని అన్నారు. అవార్డు గ్రహీతలు దీన్ని బాధ్యతగా భావించి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “స్వప్రయోజనాల కోసం రామోజీ ఎప్పుడూ తన పత్రికను వాడుకోలేదు. పత్రికారంగంలో దీపస్తంభంగా నిలిచారని” అన్నారు. రామోజీ ఫౌండేషన్‌ రూపొందించిన నిఘంటువులను ఆయన, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్‌, మాజీ ఉప రాష్ట్రపతి వేంకయ్యనాయుడు సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

55
రామోజీ వారసత్వం.. సీఎండీ కిరణ్
Image Credit : X/revanth_anumula

రామోజీ వారసత్వం.. సీఎండీ కిరణ్

రామోజీ గ్రూప్‌ సీఎండీ కిరణ్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే సాధారణ మనిషి కూడా అసాధారణ విజయాలు సాధించగలడన్న నమ్మకం రామోజీది అన్నారు. ఈ ఏడాది 900 మంది అభ్యర్థుల పరిశీలన అనంతరం ఏడుగురిని ఎంపిక చేశామని, వారిలో నలుగురు మహిళలు ఉండటం ప్రత్యేకత అని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Related Stories
Recommended image1
మహేష్ బాబు వారణాసి స్టోరీ ఏంటో తెలుసా?
Recommended image2
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved