దుబ్బాక ఉపఎన్నికలు: అభ్యర్థులపైనే అందరి దృష్టి
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీలు అభ్యర్ధుల ఎంపికతో పాటు ప్రచారంపై కేంద్రీకరించాయి.
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పార్టీలు అభ్యర్ధుల ఎంపికతో పాటు ప్రచారంపై కేంద్రీకరించాయి.
నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి హరీష్ రావు కాలికి బలపం కట్టుకొని పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రి తలపెట్టారు. ఉరుకులు పరుగుల మీద అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్ రావు.
ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక టీఆర్ఎస్ నాయకత్వం ప్రచారంపై కేంద్రీకరించనుంది. సోలిపేట రామలింగారెడ్డి భార్యకు ఈ ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కూడ ఈ స్థానం నుండి పోటకి ఆసక్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తుండడం టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందిగా మారింది. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే మరోసారి టిక్కెట్టు ఇవ్వడంపై కొందరు నేతలు అసమ్మతి స్వరాన్ని విన్పించారు.
శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది.
ఈ నియోజకవర్గంలో 146 గ్రామాలున్నాయి. ప్రతి రెండు గ్రామాలకు ఒక్క ముఖ్యనేతలను ఇంచార్జీగా కాంగ్రెస్ పార్టీ నియమించనుంది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ నేతలు ఈ గ్రామాల్లో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకొంటారు.మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా భార్యను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. విజయశాంతి పేరు కూడ ప్రచారంలో విన్పించింది. కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికను సీరియస్ గానే తీసుకొన్నారు. కుంతియా స్థానంలో బాధ్యతలు చేపట్టిన మాణికం ఠాగూర్ దుబ్బాక ఉప ఎన్నిక విషయమై చర్చించారు.
రఘునందన్ రావు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రఘునందన్ రావుకే ఈ సారి పార్టీ టిక్కెట్టు ఇస్తోందా లేదా మరో వ్యక్తి కోసం చూస్తోందా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
టీఆర్ఎస్ లోని కొందరు అసమ్మతి నేతలకు కూడ బీజేపీ గాలం వేస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు. టీఆర్ఎస్ అసమ్మతి నేతకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.