Holidays : నవంబర్ 1, 2, 3 మూడ్రోజులు సెలవులేనా..? ఏరోజు, ఎందుకో తెలుసా?
తెలుగు విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో దసరా సెలవులు ముగిశాయో లేదో తుపాను సెలవులు వచ్చాయి.. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సెలవులున్నాయి.

తెెలుగోళ్లకు సెలవులే సెలవులు
ఇప్పటికే అర్నబ్ తుపాను ఎఫెక్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరుస సెలవులు వచ్చాయి. వర్షతీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఇలా దసరా హాలిడేస్ ముగిశాయో లేదో తుపాను కారణంగా సెలవులు వచ్చాయి. ఇక్కడితో సెలవుల పరంపర ఆగడం లేదు... వచ్చే నెల (నవంబర్) లో కూడా విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రాబోతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ నెల సెలవులతోనే ప్రారంభం కాబోతోంది... నవంబర్ 1,2,3 తేదీల్లో అంటే వరుసగా మూడ్రోజులు సెలవులు రాబోతున్నాయి. ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసుకుందాం.
నవంబర్ 1.. ఆదివారం సెలవు
నవంబర్ నెల ఆదివారంతో ప్రారంభం అవుతోంది... అంటే వీకెండ్ సెలవు అన్నమాట. అయితే కొన్ని అత్యవసర విభాగాల ఉద్యోగులకు ఆదివారం కూడా వర్కింగ్ డేనే... కానీ ఏపీ ఉద్యోగులకు మాత్రం ఈవారం మాత్రం పక్కా సెలవు ఉంటుంది. నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ లోని 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో పోలింగ్ జరగనుంది... కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక సెలవు ఉంటుంది.
నవంబర్ 2న సెలవు ఉంటుందా?
నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇలా రీపోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను స్కూళ్లలోనే ఏర్పాటు చేస్తారు. కాబట్టి రీపోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో కొన్ని విద్యాసంస్థలకు నవంబర్ 2న కూడా సెలవుండే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈరోజు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. అంటే నవంబర్ 2న సెలవు అందరికీ వర్తించదు... కేవలం రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో కొందరికి మాత్రమే వర్తిస్తుంది.
నవంబర్ 3న సెలవే... ఎందుకో తెలుసా?
ఇలా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందో లేదో అలా గ్రామాలు, పట్టణాల్లో ఎంపిటిసి, జడ్పిటిసి పోలింగ్ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది... అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అక్టోబర్ 27 అంటే ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది... దీంతో తుది అభ్యర్థుల జాబితా రెడీ అవుతుంది. రేపట్నుంచి ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంటుంది.
అయితే నవంబర్ 3న ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
కార్మిక శాఖ సెలవు ఉత్తర్వులు..
నవంబర్ 3న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకే కాదు కార్మికులకు కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కార్మిక శాఖ కమీషనర్ గంధం చంద్రుడు పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కార్మికులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.
పంచాయితీ ఎన్నికల సెలవులు..
ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగియగానే గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో పోలింగ్ రోజున విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉండనుంది.
గ్రామ పంచాయితీ పోలింగ్ తేదీలివే..
నవంబర్ 26న మొదటి విడత పోలింగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాల ప్రకటన
నవంబర్ 29న రెండో విడత పోలింగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాల ప్రకటన
డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, అదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాల ప్రకటన

