మున్సిపల్ ఎన్నికలు 2020: కేసీఆర్ కు బిజెపి భయం, కారణం ఇదీ...

First Published 6, Jan 2020, 11:17 AM

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బిజెపి భయం పట్టుకున్నట్లుంది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్న తెలియజేస్తున్నాయి. పార్టీ నాయకులను మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధం చేయడానికి ఆయన ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో మనకు బిజెపి పోటీ అనేది అపోహ మాత్రమేనని, మనకు ఎవరూ పోటీ కాదని, అన్ని స్థానాలను మనమే గెలుచుకుంటామని, సర్వేలో ఆ విషయం తేలిందని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా బిజెపిని ప్రస్తావించి కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి టీఆర్ఎస్ కు కొన్ని చోట్ల బిజెపి సవాల్ విసిరే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో బిజెపికి క్యాడర్ ఉంది. పైగా, లోకసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంది. దాంతో బిజెపి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

మహబూబ్ నగర్ లోకసభ ఎన్నికల్లో బిజెపి తరఫున డీకే అరుణ పోటీ చేశారు. ఆమె ఓడిపోయినప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్లలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బిజెపి ఓట్లు పెరిగాయి. అలాగే, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోకసభ సెగ్మెంట్లలో బిజెపి ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. ఈ సీట్లను బిజెపి గెలుచుకోవడం కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఓట్ల శాతం పెరగడంతో బిజెపి టీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. పైగా, బిజెపి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందనే విషయం కేసీఆర్ కు తెలుసు. బిజెపి కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పై, చొప్పదండి, వేములవాడ, హుజూరాబాద్, సిరిసిల్ల, జమ్మికుంట హుస్నాబాద్ మున్సిపాలిటీలపై కన్నేసింది. ఇవన్నీ కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో ఉన్నాయి. బిజెపి ఎంపీ బండి సంజయ్ ఈ మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

నిజామాబాద్ లోకసభ స్థానంలో కల్వకుంట్ల కవితను ఓడించిన ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా ప్రదర్శించాలని చూస్తున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పైనే కాకుండా కోరుట్ల, జగిత్యాల, బోధన్, మెట్ పల్లి మున్సిపాలిటీలపై బిజెపి దృష్టి పెట్టింది

ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, కాగజ్ నగర్, భైంసా మున్సిపాలిటీలపై బిజెపి దృష్టి పెట్టింది. మహబూబ్ నగర్, మక్తల్ మున్సిపాలిటీలపై కూడా బిజెపి కన్నేసింది