MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Monsoon : ఏమిటీ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్? ఏది జారీచేస్తే ఏం జరుగుతుంది?

Monsoon : ఏమిటీ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్? ఏది జారీచేస్తే ఏం జరుగుతుంది?

వర్షాకాలంలో జారీచేసే ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్ ఏమిటి? వాటిని ఎవరు జారీ చేస్తారు? ఒక్కో అలర్ట్ వెనుకున్న అర్థం, వర్షపాతం ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 12 2025, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వర్షాకాలంలో తప్పకుండా తెెలుసుకోవాల్సిన విషయాలివి..
Image Credit : X/India Meteorological Department

వర్షాకాలంలో తప్పకుండా తెెలుసుకోవాల్సిన విషయాలివి..

monsoon : సీజనల్ పండ్ల గురించి అందరికీ తెలుసు... సీజనల్ వ్యాధుల గురించి వినివుంటారు... మరి సీజనల్ పదాల గురించి ఎప్పుడైనా విన్నారా?... కొన్ని పదాలు కొన్ని సీజన్లలో బాగా వినిపిస్తుంటాయి. ఇలా వేసవి, శీతాకాలంలో అధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు అనే పదాలు బాగా వినిపిస్తారు. ఇక వర్షాకాలంలో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్... తుఫాను, ప్రమాద హెచ్చరికలు,   క్యూసెక్కులు అనే పదాలు బాగా వినిపిస్తారు.

అయితే వర్షాకాలంలో ఈ పదాలను వినడమే తప్ప చాలామందికి వీటిగురించి తెలియదు. కాబట్టి ఈ అలర్ట్స్ ఏమిటి? ఎప్పుడు ఏ అలర్ట్ జారీ చేస్తారు? ఎవరు చేస్తారు? ఈ సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలేమిటి? తదితర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
అసలు ఏమిటీ వెదర్ అలర్ట్స్?
Image Credit : Gemini

అసలు ఏమిటీ వెదర్ అలర్ట్స్?

వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థలు వంటి వ్యవస్థలను ఏర్పాటుచేసింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ముందుగానే ఊహించగలిగితే... ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయగలిగితే... ఈ ఆలోచన నుండి వచ్చినవే వాతావరణ హెచ్చరికలు. వాతావరణ విభాగాలు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో వాతావరణం ఎలా ఉండనుందో ముందే అంచనావేస్తాయి... ఇందుకు తగినట్లుగా వివిధ రకాల హెచ్చరికలు జారీ చేస్తుంది.

Related Articles

Related image1
Telangana Rains : జులై ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే.. మరి సెకండాఫ్ పరిస్ధితేంటి?
Related image2
Telangana Rains : అయ్యోపాపం... అన్నదాతలను వరుణుడు కూడా కరుణించడంలేదే, ఈ నెలా లోటు వర్షపాతమే
37
వర్షాకాలంలో జారీ చేసే హెచ్చరికలివే :
Image Credit : iSTOCK

వర్షాకాలంలో జారీ చేసే హెచ్చరికలివే :

వర్షాకాలంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు రకాల వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తారు. ఇవి ప్రమాద తీవ్రతను సూచిస్తాయి... వీటిని బట్టి అధికారులు కూడా ముందుజాగ్రత్త చర్యలు చేపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ హెచ్చరికల గురించి తెలియాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో జారీచేసే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్ గురించి తెలుసుకుందాం.

47
1. గ్రీన్ అలర్ట్
Image Credit : Pexels

1. గ్రీన్ అలర్ట్

ఏదైనా ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే ఈ గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. ఈ అలర్ట్ జారీ చేసారంటే చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయి. 24 గంటల్లో కేవలం 6.45 సెంటిమీటర్ల లోపే వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటాయి. ఈ అలర్ట్ జారీచేస్తే ప్రమాదమేమీ లేనట్లే.

57
2. ఎల్లో అలర్ట్
Image Credit : ANI

2. ఎల్లో అలర్ట్

ఈ హెచ్చరిక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటే జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే రాబోయే 24 గంటల్లో ఏదైనా ఓ ప్రాంతంలో 6.4 సెంటిమీటర్ల నుండి 11.55 సెం.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే ఈ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే చిరుజల్లుల కంటే కాస్త ఎక్కువ వర్షమే కురుస్తుందన్నమాట.

67
3.ఆరెంజ్ అలర్ట్
Image Credit : ChatGPT

3.ఆరెంజ్ అలర్ట్

భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటే ఈ అలర్ట్ జారీ చేస్తారు. 24 గంటల్లో ఓ ప్రాంతంలో 11 సెంటిమీటర్ల నుండి 20 సెం.మీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటే వాతావరణ శాఖ ఈ హెచ్చరిక చేస్తుంది. భారీ వర్షాలు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అలర్ట్ వెలువడితే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుంది... అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.

77
4. రెడ్ అలర్ట్
Image Credit : Getty

4. రెడ్ అలర్ట్

వాతావరణ శాఖ విడుదలచేసే చివరి హెచ్చరిక రెడ్ అలర్ట్. ఓ ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో అసాధారణ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటేనే ఈ అలర్ట్ జారీ చేస్తారు. ఎడతెరిపి లేకుండా కుండపోతగా 20 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంటే ఈ రెడ్ అలర్ట్ సూచిస్తుంది.

ఈ రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉంటుంది... కాబట్టి లోతట్టు ప్రాంతాలు మునకకు గురవుతాయి. ఈ సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఇక గాలివాన కారణంగా పెద్దపెద్ద చెట్లు, హోర్డింగ్స్ వంటివి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ విభాగం రెడీగా ఉంటుంది.

రెడ్ అలర్ట్ చాలా అరుదు... ప్రతి వర్షాకాలంలో ఓ ప్రాంతంలో గరిష్టంగా నాలుగైదుసార్లు మాత్రమే ఇది జారీ అయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న కొన్ని రాష్ట్రాల్లో ఈ రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ సంస్థ (IMD). రెడ్ అలర్ట్ సమయంలో భారీ ఆస్తినష్టం, ఒక్కోసారి ప్రాణనష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన స్విగ్గి, జొమాటో బాయ్స్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Now Playing
Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
Recommended image3
Now Playing
DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue
Related Stories
Recommended image1
Telangana Rains : జులై ఫస్ట్ హాఫ్ లో ఇక వర్షాలు లేనట్లే.. మరి సెకండాఫ్ పరిస్ధితేంటి?
Recommended image2
Telangana Rains : అయ్యోపాపం... అన్నదాతలను వరుణుడు కూడా కరుణించడంలేదే, ఈ నెలా లోటు వర్షపాతమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved