MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీ సెలవు ఉందా?

School Holidays : రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీ సెలవు ఉందా?

రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ఉంది. ఇంతకూ ఏ జిల్లాల్లో సెలవు ఉంటుంది? ఎందుకోసం ఈ సెలవు ఇచ్చారో ఇక్కడ తెలుసుకొండి. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 26 2025, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
school holidays

school holidays

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(బుధవారం) విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఇచ్చారు. అయితే రేపు(గురువారం) విద్యాసంస్థలకు సెలవు ఉందో లేదో తెలియక స్టూడెంట్స్, టీచర్స్... కార్యాలయాలకు సెలవు ఉందోలేదో తెలియక ఉద్యోగులు డైలమాలో ఉన్నారు. ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫిబ్రవరి 27న అంటే రేపటి సెలవుపై క్లారిటీ లేదు. 

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లోని విద్యాసంస్థలు, ఉద్యోగులకు గురువారం సెలవు ప్రకటించాయి ఇరు తెలుగు ప్రభుత్వాలు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఓట్ల లెక్కింపు జరిగే మార్చి 3న కూడా సెలవు ప్రకటించింది. అలాగే ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. 
 

23
Telangana MLC Elections 2025

Telangana MLC Elections 2025

తెలంగాణలో ఫిబ్రవరి 27, మార్చి 3న సెలవు :

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఏకంగా రెండురోజులు సెలవు ఇచ్చారు. ఫిబ్రవరి 27న ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ బూత్ లు ఏర్పాటుచేసారు. అలాగే గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు నడిచే అవకాశం లేదు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటారు. కాబట్టి పోలింగ్ డే రోజున అంటే రేపు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

ఇక మార్చి 3న అంటే వచ్చే సోమవారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. అలాగే ఈ ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. అందుకోసమే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఓట్ల లెక్కింపు రోజున కూడా సెలవు ప్రకటించారు.  

ఇలా గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 27న స్కూళ్లకు సెలవు ఉంటుంది. అలాగే ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాలో కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఇలా గురువారం పోలింగ్ జరిగే జిల్లాల్లో సెలవుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసారు.
 

33
Andhra Pradesh MLC Elections 2025

Andhra Pradesh MLC Elections 2025

ఆంధ్ర ప్రదేశ్ లో ఫిబ్రవరి 27న సెలవు : 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు, ప్రచార ప్రక్రియ ముగిసింది. ఇక ఓటర్ల తీర్పు ఒక్కటే మిగిలింది ... ఇందుకోసం ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ జరిగే జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

రేపు గురువారం ఉమ్మడి కృష్ణా-గుంటూరు తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక ఉమ్మడి విశాఖపట్నం-విజయనగరం‌-శ్రీకాకుళం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆ జిల్లాలో కూడా సెలవు ఉండనుంది.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
Recommended image2
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
Recommended image3
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved