మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం.. ముగ్గురు చిన్నారుల తల్లికి పునరావాసం..

First Published May 19, 2021, 4:38 PM IST

భర్త చనిపోయి.. కరోనాతో పనులు లేక.. ముగ్గురు చిన్నారులను పోషించలేక అవస్థ పడుతున్న ఓ నిరుపేద మహిళకు మంత్రి సత్యవతి రాథోడ్ పునరావాసం కల్పించారు. ఆమె భర్త చనిపోయారు..బతుకు భారం అయింది...ఉన్న ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పేదరికం..మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు కరోనా మహమ్మారి వల్ల కుటుంబం కడుపునింపుకునే కాస్తా అదరువు కూడా కరువైంది.