MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో 'మినీ డిస్నిల్యాండ్' : పిల్లలతో తప్పక వెళ్లాల్సిన పిక్నిక్ స్పాట్

హైదరాబాద్ లో 'మినీ డిస్నిల్యాండ్' : పిల్లలతో తప్పక వెళ్లాల్సిన పిక్నిక్ స్పాట్

మీ పిల్లలతో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు వున్నాయి. అయితే వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేవి మాత్రం కొన్నే వున్నాయి. అలాంటిదే ఈ ' మినీ డిస్నిల్యాండ్'... ఇది ఎక్కడుందో తెలుసా?

2 Min read
Arun Kumar P
Published : Jan 27 2025, 02:28 PM IST | Updated : Jan 27 2025, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Hyderabad Disneyland

Hyderabad Disneyland

Hyderabad Disneyland  డిస్నీ ల్యాండ్... అమెరికాలోని కలిఫోర్నియాలో వాల్డ్ డిస్నీ సృష్టించిన కొత్తప్రపంచం. ఈ థీమ్ పార్క్ ను ఒక్కసారైనా చూడాలని పిల్లలు కోరుకుంటారు... కానీ అందరికీ ఇది సాధ్యంకాదు. అయితే ఈ డిస్నీ ల్యాండ్ ను ఆదర్శంగా తీసుకుని మనదేశంలోనూ అనేక థీమ్ పార్కులను ఏర్పాటయ్యాయి... అక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి అద్భుతమైన పార్కులు మన తెలుగు రాష్ట్రాల్లోనూ వున్నాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అనేక థీమ్ పార్కులు వున్నాయి. వీటిలో 'మినీ డిస్నీల్యాండ్' గా గుర్తింపుపొందింది 'డైసీ డేల్ ఫార్మ్ పార్క్ ఆండ్ రిసార్ట్'. ఇది హైదరబాదీలను ఎంతగానో ఆకట్టుకుంటోంది... దీంతో వీకెండ్ లో తమ పిల్లలను తీసుకుని ఈ మినీ డిస్నీల్యాండ్ కు పయనం అవుతున్నారు పేరెంట్స్. 

23
Mini Disneyland

Mini Disneyland

ఈ మినీ డిస్నీల్యాడ్ విశేషాలు : 

హైదరాబాద్ శివారులోని ప్రకృతి అందాలమధ్య వెలిసింది ఈ డైసీ డేల్ ఫార్మ్ పార్క్ ఆండ్ రిసార్ట్. ప్రశాంత వాతావరణంలో పిల్లలతో సరదాగా గడపాలనుకునే పేరెంట్స్ కు ఇది పర్ఫెక్ట్ స్పాట్. నగరానికి చాలా దగ్గరగా పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో వుంటుంది ఈ పార్క్ ఆండ్ రిసార్ట్. 

ఇక్కడ పిల్లలకోసం గేమ్స్ మాత్రమే కాదు విజ్ఞానాన్ని అందించే ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇక్కడ వివిధ రకాల పెంపుడు జంతువులు (ఆవులు, మేకలు, పందులు, కుందేళ్లు), అందమైన పక్షులను (మాట్లాడే రంగురంగుల చిలకలు) కూడా చూడవచ్చు. అంతేకాదు అడవి జంతువుల రూపాలను కూడా ఏర్పాటుచేసారు. మొత్తంగా ఈ థీమ్ పార్క్ కు వెళితే మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయడమే మీరు కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఫీల్ అవుతారు. 

కుటుంబం మొత్తం రోజంతా హాయిగా గడిపేలా డైసీ డేల్ ఫార్మ్ పార్క్ ఆండ్ రిసార్ట్ ఏర్పాట్లు వున్నాయి. పిల్లలకు థ్రిల్లింగ్ గేమ్స్ తో పాటు జంతువులు, పక్షులతో సరదాగా గడిపే అవకాశం వుంటుంది. పిల్లలకు గుర్రపు స్వారీ అనుభూతిని కూడా పొందవచ్చు. ఇక్కడ మీ పిల్లలకు ఫోటోలు, వీడియోలు తీసేందుకు కూడా బ్యూటిఫుల్ స్పాట్స్ వున్నాయి...ముఖ్యంగా 'డిస్నీల్యాండ్' ను పోలిన నిర్మాణం తప్పకుండా ఆకట్టుకుంటుంది. అక్కడ మీ పిల్లలకు ఫోటోలు, వీడియోలు తీయడం వుండలేరు అనడంలో అతిశయోక్తి లేదు... అంత బాగుంటుంది.

ఇక ఇక్కడ లభించే రుచికరమైన ఫుడ్ ను పచ్చని ప్రకృతి అందాల మధ్య ఆస్వాదించవచ్చు.  ఒక్కసారి ఇక్కడికి వెళితే మళ్లీమళ్లీ వెళ్లాలి అనేంతలా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ కు అతి దగ్గరలో వుండటం కూడా ఈ థీమ్ పార్క్ సక్సెస్ కు కలిసొచ్చిన మరో అంశం.

33
Mini Disneyland

Mini Disneyland

ఇంతకూ ఎక్కడుంది ఈ మినీ డిస్నీల్యాండ్ : 

హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిధిలోని మోకిళలో డైసీ డేల్ ఫార్మ్ ఆండ్ రిసార్ట్ వుంది. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు సమీపంలో వుంటుంది. హైదరాబాద్ నుండి దాదాపు గంట గంటన్నర జర్నీ. 

ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచివుంటుంది. మంగళవారం ఒక్కరోజు మాత్రం పూర్తిగా మూసివుంటుంది. ఆరోజు సందర్శకులకు డైసీ డేల్ ఫార్మ్ పార్క్ లోకి అనుమతి వుండదు. 

ఎంట్రీ ఫీజు : 

పిల్లలకు రూ.550

పెద్దవాళ్లకు రూ.600  
 

About the Author

Arun Kumar P
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved