Mekapati Goutham Reddy death : సంతాపం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల
ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణం మీద తెలంగాణ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, తలసాని, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంతాపం తెలిపారు.

హైదరాబాద్ : ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిమృతికి టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అకాల మరణం నన్నుకలచివేసింది. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
YS Sharmila
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS Sharmila మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్లిన షర్మిల వారి కుటుంబాన్ని ఓదార్చారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో భార్య, కూతురిని వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పలకరించారు.
ktr
ఇక, ఇంతకుముందే గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్ గురిచేసిందని చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రియమైన మిత్రుడి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. నమ్మలేని విధంగా షాక్ అయ్యాను ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా త్వరగా వెళ్లిపోయారు అన్న.. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
mekapati
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి Talasani Srinivasayadav సంతాపం వ్యక్తం చేశారు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయన మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని.. ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరుకు తరలించడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.
Sharmila
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు.