తగ్గిన సిద్ధిపేట మెజారిటీ: హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

First Published 29, May 2019, 10:53 AM

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

లోకసభ ఎన్నికల్లో తను సరైన ఫలితాలను రాబట్టలేకపోయాననేది వాస్తవమని, అయితే తాను విఫలం కాలేదని కేటీఆర్ అన్నారు. కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై, హరీష్ రావు ఇంచార్జీగా వ్యవహరించిన మెదక్ లోకసభ స్థానంలో మూడు లక్షలకు పైగా మెజారిటీ రావడంపై ఆయన స్పందించారు.

మెదక్ లోకసభ స్థానంలో పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చినప్పటికీ సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గంలో తగ్గిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావును పక్కన పెట్టామనే విషయం వాస్తవం కాదని ఆయన అన్నారు. కవిత ఓడిపోవడానికి రైతుల మూకుమ్మడి పోటీ కారణం కాదని ఆయన అన్నారు. నామినేషన్లు వేసినవారు రైతులు కారని, రాజకీయ నేతలని ఆయన అన్నారు.

గతంలో తాను, కవిత పలు సమస్యలను ఎదుర్కున్నామని, ఒక్క ఓటమి తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయలేదని ఆయన అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గంలో లోకసభ ఎన్నికల్లో బిజెపికి 50 వేల ఓట్లు పడ్డాయని, డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3000 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.

కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీ సాధించినందున తాము 16 సీట్లు గెలుచుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదని కేటీఆర్ రామారావు అన్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటివారే ఓటమి పాలయ్యారని ఆయన గుర్తు చేశారు.

loader