MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Telangana
  • 'ఓరుగల్లు'ను ముంచెత్తిన వరద : భారీ వర్షాల దాటికి అతలాకుతలం, జలదిగ్భంధంలో కాలనీలు (ఫోటోలు)

'ఓరుగల్లు'ను ముంచెత్తిన వరద : భారీ వర్షాల దాటికి అతలాకుతలం, జలదిగ్భంధంలో కాలనీలు (ఫోటోలు)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  వరంగల్ నగరం అతలాకుతలమైంది . వరద నీరు పోటెత్తి కాలనీలను చుట్టుముట్టింది. వరదలో చిక్కుకున్న 50 మందిని పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భగత్ సింగ్ కాలనీ, కాకతీయ యూనివర్సిటీ కళాశాల ప్రాంతాల్లో వరద చుట్టుముట్టడంతో  ఇళ్లల్లో చిక్కుకుపోయిన 20 కుటుంబాలను  పోలీసులు కాపాడారు.
 

Siva Kodati | Published : Jul 27 2023, 09:29 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
warangal

warangal

హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వాగుపై బైక్ నడిపిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వ్యక్తిని మహేందర్‌గా గుర్తించారు. 

24
waranga

waranga

వరంగల్ నగరంలోని  హంటర్ రోడ్డు, నయీం నగర్, శివనగర్ బస్తీల్లోకి భారీగా వరద నీరు  వచ్చి చేరింది. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హంటర్ రోడ్డులో వరద భాదితులను రక్షించేందుకు  ఎస్‌డీఆర్ఎఫ్, పైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 
 

34
waranga

waranga

హంటర్ రోడ్డులో వరదలో చిక్కుకున్న స్థానికులను  కాపాడేందుకు స్పీడ్ బోట్ సహాయంతో  వెళ్లిన  ఎస్ఐ సాంబయ్య కూడ వరద నీటిలో  చిక్కుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, పైర్ సిబ్బంది బోట్ల సహాయంతో స్పీడ్ బోటులో చిక్కుకున్న వారిని కాపాడారు.

44
waranga

waranga

వరంగల్ నగరానికి చుట్టూ నాలుగు చెరువులున్నాయి. వడ్డేపల్లి చెరువు పరివాహక ప్రాంతంలో నాలుగు గంటల వ్యవధిలో 20 సెం.మీ వర్షపాతం  నమోదైంది. దీంతో  నగరంలో ఈ స్థాయిలో వరదలు సంభవించాయి. అటు వరంగల్  రైల్వే స్టేషన్‌ కూడా నీట మునగడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

Siva Kodati
About the Author
Siva Kodati
 
Recommended Stories
Top Stories