మద్యం దొరక్క పిచ్చి.. ఎర్రగడ్డ ఆస్పత్రి కిటకిట, ఇందూరులో ఐదుగురు మృతి

First Published 30, Mar 2020, 4:23 PM

లాక్ డౌన్ లో భాగంగా వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ నుంచి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే.. ఇప్పుడు కరోనాని మించిన కేసులు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి.

లాక్ డౌన్ లో మద్యం దొరకక పలువురు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్యకాలంలో బ్లూ వేల్, పబ్జీ లాంటి గేమ్స్ కి బానిసలుగా మారి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు చదివే ఉంటారు. అలాంటి పిచ్చి ఇప్పుడు మద్యం దొరకక చాలా మందికి పట్టింది. మందు దొరకడం లేదని.. చాలా మంది సూసైడ్ లు చేసుకోవడం గమనార్హం.

గత కొద్ది రోజులుగా ఈ రకం కేసులు ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన లంబడి సత్తయ్య(46) కూలి పని చేసుకుని జీవించేవాడు. తాగుడుకు బానిస కావడంతో కల్లు, మద్యం అమ్మకాలు బంద్‌ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో శనివారం ఉదయం ఉరేసుకున్నాడు.

రెండు రోజుల క్రితం సినీ పరిశ్రమలో పని చేసే మధు అనే వ్యక్తి మద్యం దొరక్క తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. చివరికి శనివారం తెల్లవారు జామున 4 గంటలకు భవనం పై నుండి దూకాడు. పక్కనున్న వారు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. తాజాగా ఇందరూలో మరో ఐదుగురు ప్రాణాలు వదిలారు.

రెండు రోజుల క్రితం సినీ పరిశ్రమలో పని చేసే మధు అనే వ్యక్తి మద్యం దొరక్క తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. చివరికి శనివారం తెల్లవారు జామున 4 గంటలకు భవనం పై నుండి దూకాడు. పక్కనున్న వారు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. తాజాగా ఇందరూలో మరో ఐదుగురు ప్రాణాలు వదిలారు.

లాక్ డౌన్ లో భాగంగా వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

లాక్ డౌన్ లో భాగంగా వైన్ షాపులను కూడా పూర్తిగా మూసి వేసారు. కానీ తెలంగాణలో విచ్చలవిడిగా లభ్యమయ్యే మద్యానికి లక్షల్లో బానిసలు అయినవారు ఉన్నారు. ఈ మందు బాబులకు చుక్క దొరక్క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

వారం రోజుల వరకు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబుల పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు మందు తాగడానికి అలవాటు పడి ఉండడంతో ఒక్క సారిగా అది దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.

ఈ వరస ఘటనలపై ఎర్రగడ్ద మానసిక వైద్యశాల సూపరిండెంట్ డా,, ఉమా శంకర్ మాట్లాడారు. గత రెండు రోజులుగా హాస్పిటల్ కి భారీగా ఒపి కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.

మొన్నటి వరకు రోజుకు 30-40 వరకు వస్తే అందులో 4 వరకు మద్యం కేసులు ఉండేవి కానీ సోమవారం ఒక్కరోజే 100  ఓపి కేసులు మద్యానికి సంబందించినవి వచ్చాయని చెప్పారు.

వారందరికీ చికిత్స అందిస్తున్నామని.. అవసరమైన వారికి ఇక్కడే అడ్మిట్ చేసుకొని మిగిలిన వారిని పంపిస్తున్నామని చెప్పారు.ప్రతిరోజు మద్యం ,కళ్ళు తాగడం వల్ల ఒక్కసారిగా తాగడానికి దొరకాకపోవడం తో  వారి ప్రవర్తన వింతగా మారిందని చెప్పారు.

ఎక్కువగా క్లోరోఫామ్ ,డైజోఫామ్ వాడడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని డాక్టర్ తెలిపారు.  మందు దొరకాకపోవడం వల్ల ఇది వారిలో 24 గంటల్లో వారిపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ని అన్ని జిల్లాల వారు హైదరాబాద్ కి రావాల్సిన అవసరం లేదని.. జిల్లాల్లో కూడా హాస్పిటల్ లు ఉన్నాయన్నారు.  అక్కడ కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని..ప్రతి హాస్పిటల్ లో డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని వివరించారు.

loader