బీజేపీనేతలు అర్వింద్, రఘునందన్ కు కీలక బాధ్యతలు.. అమిత్ షా పర్యటన వేళ కీలక మార్పులు..
ఈనెల 29న తెలంగాణలో అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అర్వింద్, రఘునందన్ లకు కీలకబాధ్యతలు అప్పగించనున్నారు.
హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో బిజెపి స్పీడ్ పెంచింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే ఈనెల 29వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ బిజెపిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్ర బిజెపి అమిత్ షా పర్యటనకు అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది.
ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించడం.. కిషన్ రెడ్డిని ఆ పదవిలో నియమించడం, పార్టీ నేతల్లో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా.. రాష్ట్రంలో బిజెపి పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు.
ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఈ పనిలో బిజీగా ఉన్నారు. 29వ తేదీన అమిత్ షా పర్యటన సందర్భంగా లాయర్, ఇంజనీర్స్, డాక్టర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అంతే కాకుండా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారు రూం ఏర్పాటుకు కూడా కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే వారు రూం ఇన్చార్జిగా ఎవరిని పెడతారనే దానిమీద కూడా చర్చ జరుగుతుంది. ఈ మార్పు పరిణామాల క్రమంలోనే సోషల్ మీడియా బాధ్యతలు ఎంపి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ లకు అప్పగించారు.
స్టాటజీ టీం ఇన్చార్జిగా శ్వేతా శాలిని నియమించారు. కోఆర్డినేషన్ కమిటీ బాధ్యతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతలకు అప్పగించారు. కాగా వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం బిజెపి హైకమాండ్ మీద రఘునందన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.