KCR Birthday : మనవడు హిమాన్షుతో కలిసి పావురాలు ఎగరేసి మురిసిపోయిన కేసీఆర్...
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. కేసీఆర్ కూడా కుటుంబసభ్యులతో రోజంతా సరదాగా గడిపారు. భార్య, కొడుకు,కోడలు, మనవడు, మనవరాలితో కలిసి కేసీఆర్ మొక్కలు నాటారు. ఆ తరువాత మనవడు హిమాన్షుతో కలిసి పావురాలకు స్వేచ్చగా గాల్లోకి వదిలారు.

kcr and himanshu Released Pigeon Into Sky
నిన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, బీజేపీ తెలంగాణ అధినేత బండి సంజయ్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, స్మితా సబర్వాల్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.
kcr and himanshu Released Pigeon Into Sky
తన తాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు మొక్కలు నాటి, పావురాలు ఎగరవేశామని చెబుతూ కలవకుంట్ల హిమాన్షు ట్విట్టర్ లో తెలిపారు.
kcr and himanshu Released Pigeon Into Sky
కాగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ Rewanth Reddy చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఊసరవెల్లి.. ఫొటోనూ షేర్ చేశాడు. అయితే శుభాకాంక్షలు ఎవరికో ఆయన ప్రస్తావించలేదు. కాకపోతే ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఇది ఆయనను ఉద్దేశించే అనేది తెలుస్తోంది.
kcr and himanshu Released Pigeon Into Sky
Janasena అధినేత, పవర్ స్టార్ Pawan Kalyan తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు కె.సి.ఆర్. ఎంతటి జఠిలమైన సమస్య State of Telanganaకి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి’ అంటూ ప్రశంసించారు.
kcr and himanshu Released Pigeon Into Sky
ఇంకా చెబుతూ.. ‘ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం శ్రీ కె.సి.ఆర్.గారిని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కె.సి.ఆర్.గారిలోని మరో ప్రత్యేకత. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం. రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం.. విజ్ఞులందరితోపాటు నాకూ ఆనందాన్ని కలిగించింది’ అని సంతోషం వ్యక్తం చేశారు.