పాలిటిక్స్ లో మళ్లీ కవిత యాక్టివ్: బీజేపీకి చెక్ కోసమేనా?

First Published 30, Jun 2020, 12:29 PM

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత యాక్టివ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కవితను అస్త్రంగా ఉపయోగించుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

మాజీ ఎంపీ కవిత  రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఆందోళనలు నిర్వహించడంలో కవిత కీలకపాత్ర పోషించారు.నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

2014-2019 వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత కీలక పాత్ర పోషించారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం కోసం ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

అయితే ఎంపీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలై బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించడం టీఆర్ఎస్ కు రాజకీయంగా ఎదురుదెబ్బేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే అదే జిల్లా నుండి స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కవిత పోటీకి దిగారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో  బీజేపీకి  అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు కవిత కూడ ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలను కవిత మళ్లీ స్వీకరించారు.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  బొగ్గు బ్లాక్ ల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమం ద్వారా కవిత రీఎంట్రీ ఇస్తున్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగరేణివ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఒకరోజు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తనను ఓడించిన బీజేపీపై ముప్పేట దాడి చేసేందుకు కవిత కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. కవిత రీఎంట్రీపై టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం క్యాడర్ లో జోష్ మొదలైంది. ఎన్నికలకు ముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవికి ఆమె రాజీనామా చేశారు.

వాస్తవానికి కవిత గతేడాది జనవరి వరకు  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక కార్మిక సమస్యలను పరిష్కరించారు. అదే సమయంలో యూనియన్ నేతల వర్గపోరు, అవినీతి అక్రమాలతో బలహీనపడిన టీబీజీకేఎస్ కు జీవం పోశారు.

2017లో జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల్లో ఓటమి ఖాయం అనుకున్న టీబీజీకేఎస్ ను గెలుపు తీరానికి చేర్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీన్ మారింది.

పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అనుబంధ కార్మిక సంఘాల బాధ్యతల నుంచి తప్పుకోవాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆర్టీసీ తదితర కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా ఉన్న హరీష్ రావు ముందుగా తన పదవులకు రాజీనామా చేశారు.

ఆ తర్వాత ఎంపీ కవిత కూడా గతేడాది ఫిబ్రవరిలో టీబీజీకేఎస్ తోపాటు  ఇతర కార్మిక సంఘాల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ ఇద్దరు ముఖ్యనేతలు తప్పుకోవడంపై అప్పట్లో అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి.

నిజానికి కవిత నిష్క్రమణతో సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బలహీనపడుతూ వచ్చింది. అందులో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. అంతర్గత సమావేశాల్లో కొట్టుకోవడాలు, నాయకుల రాజీనామాలు నిత్యకృత్యం అయ్యాయి. వారిని నియంత్రించేవారు కరువయ్యారు. యూనియన్ లో కొందరు నేతలు యూనియన్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న బీఎంఎస్ లో చేరారు. ఈ పరిణామం కూడ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకత్వాన్ని షాక్ కు గురి చేసింది.

మరోవైపు సింగరేణిలోని సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు కొన్నాళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. వారికి కార్మికుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బొగ్గు గనుల ప్రయివేటీకరణకు నిరసనగా  జాతీయ కార్మిక సంఘాలు ఏకమయ్యాయి.

జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈనెల 18న సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. జులై 2 నుంచి మూడురోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.  ఈ విషయంలో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ వెనుకబడింది. పైగా సింగరేణి గుర్తింపు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కవిత రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. ఆ ఎన్నికల్లో కవిత గెలుపు లాంఛనమేనని ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.  ఈ ఎన్నికల కంటే ముందే  సింగరేణి యూనియన్ లో క్రియాశీలక పాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది.

తెలంగాణలో బలపడాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీపై ఎదురుదాడికి బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లేందుకు కవిత కార్యాచరణను సిద్ధం చేసినట్టు  చెబుతున్నారు.

loader