‘కవిత’ తప్పిన బతుకమ్మ.. సగానికి సగం నిధుల కోత

First Published 4, Oct 2019, 12:31 PM

ఏర్పాట్లు పక్కనుంచితే, ప్రజలు కూడా అంత పెద్ద సంఖ్యలో రోడ్ల మీద కనపడడం లేదు. ఇదేదో హైదరాబాద్ మహానగరానికి పరిమితం కాలేదు. పట్టణాల్లో, గ్రామాల్లో కూడా కొంత హడావుడి తగ్గిన మాట వాస్తవం. తెలంగాణ వచ్చిన సంవత్సరం అందరికి గుర్తుండే ఉంటుంది, ట్యాంక్ బండ్ పైన భారీ ఎత్తున ఈ వేడుకలను నిర్వహించారు. 

తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. తీరొక్కపూలతో తెలంగాణ ఆడపడుచులు గొప్పగా జరుపుకునే పండుగ. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపంగా వెలుగొందింది ఈ బతుకమ్మ పండుగ. ప్రతి ఏడాది దసరా పండుగ ముందు ఎంగిలిపువ్వు బతుకమ్మ తో మొదలయ్యి సద్దులబతుకమ్మతో ముగుస్తుంది.

ప్రతి సంవత్సరం హైదరాబాద్ తో సహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ఈ సంబురం అంబరాన్నంటుతుంది. కానీ ఈ సంవత్సరం రోడ్లపైన చూస్తుంటే బతుకమ్మ హడావుడి అంతలా కనపడడం లేదు. జంట నగరాల్లో ప్రతిసారి బతుకమ్మలు పేర్వేడానికి ఎల్బీ స్టేడియం వేదికగా బ్రహ్మాండమైన వేడుక జరిగేది. ఈసారి అలంటి ప్రత్యేక ఏర్పాట్లు కనపడడం లేదు. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బయో డైవర్సిటీ సర్కిల్ వరకు ప్రధాన కూడళ్లలో పెద్ద బతుకమ్మల నమూనాలు కనపడేవి. ఈసారి వాటి ఊసే లేదు.

దీనికి ప్రధాన కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఈ సంబరాల్లో పాల్గొనకపోవడమే అని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం కవిత బతుకమ్మ వేడుకల్లో చురుకుగా పాల్గొనేది. రోజుకో జిల్లా తిరుగుతూ సందడి చేసేది. ఈసారి మాత్రం ఆమె సంబరాలకు దూరంగా ఉంది. తన ఇంటి వద్ద ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఆమె  పండగ చేసుకోవడం గమనార్హం.

నీసం ఏర్పాట్లు కూడా సరగా జరగలేదు. ఈ ఏర్పాట్లు పక్కనుంచితే, ప్రజలు కూడా అంత పెద్ద సంఖ్యలో రోడ్ల మీద కనపడడం లేదు. ఇదేదో హైదరాబాద్ మహానగరానికి పరిమితం కాలేదు. పట్టణాల్లో, గ్రామాల్లో కూడా కొంత హడావుడి తగ్గిన మాట వాస్తవం.

తెలంగాణ వచ్చిన సంవత్సరం అందరికి గుర్తుండే ఉంటుంది, ట్యాంక్ బండ్ పైన భారీ ఎత్తున ఈ వేడుకలను నిర్వహించారు. స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు. పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ మొత్తం మిరుమిట్లుగొలిపేలా బాణాసంచా కాల్చారు. గత ఏడాది వరకు భారీ స్థాయిలోనే జరిపేవారు.

ఈ ఏడాది మాత్రం దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. గత ఏడాది 20 కోట్ల రూపాయల నిధులను బతుకమ్మ ఉత్సవాల కోసం విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 10కోట్లను మాత్రమే ఇచ్చింది. ఎన్నికల సంవత్సరం కాబట్టి గతేడాది ఎక్కువగా ఖర్చుపెట్టారని ఎన్నికలయిపోగానే ప్రభుత్వం నిధుల్లో కొరత విధించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఏకంగా కవిత ఓడిపోవడం వల్ల కెసిఆర్ కు బతుకమ్మ నిర్వహణ పట్ల ఆసక్తి తగ్గిందని తెగ జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు.

ఏది ఎలా ఉన్న ప్రజలు కూడా ఎక్కువగా కనపడడం లేదు. దేశంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి కూడా దీనికి కారణం కావచ్చు. పూల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ దొరికే తంగేడు పూలు ఇప్పుడు సూపర్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. 'బతుకమ్మ పూల కిట్' పేరిట సూపర్ మార్కెట్లు సొమ్ము చేసుకుంటున్నాయి.

ఆర్ధిక మాంద్యంతోనిపాటు వాతావరణం కూడా ఈ బతుకమ్మ పండుగపై ఒకింతప్రభావం చూపెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండడం, వర్షం ఎప్పుడు పడుతుందో అర్థం కాకపోవడం, వర్షం కురిస్తే భారీగా కురుస్తుండడం తో ఆడవాళ్లు సాహసించి బయటకు వెళ్లలేకపోతున్నారు.

ప్రజల విషయాన్నీ పక్కకుంచితే, తెలంగాణ అస్థిత్వంగా బతుకమ్మను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ జాగృతిది, దాని అధ్యక్షురాలు కవితది. తెలంగాణ నుంచి టెక్సాస్ వరకు తెలంగాణవారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ, కుదిరితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఈ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఈసారి జాగృతివారు కూడా ప్రతిసారి చూపెట్టేంత ఉత్సవాహాన్ని చూపెట్టడంలేదనేది వినపడుతున్న మాట. కవిత కూడా ఈసారి దూరంగా ఉన్నారు.

కోలాహలంగా పూల పందిరిని తలపించేలా సాగే తెలంగాణ రాష్ట్ర పండుగ ఈ సారి మాత్రం ఆలా కనిపించకపోవడం ఒకింత బాధాకరం. మారుతున్న జీవనశైలిలో మిగిలిన అన్ని పండుగల లాగానే బతుకమ్మ కూడా ప్రాభవాన్ని కోల్పోతుందనుకోవాలో లేక ఈ ఒక్క యాడాదే ఇలా ఉందనుకోవాలో అర్థంకాని పరిస్థితి.

loader