MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • మంత్రి తలసానిని కలిసిన కర్ణాటక మంత్రి.. రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రశంసలు

మంత్రి తలసానిని కలిసిన కర్ణాటక మంత్రి.. రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించడానికి కర్ణాటక నుంచి మంత్రి సహా అధికార ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలన పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కలిశారు.

2 Min read
Author : pratap reddy
| Updated : Nov 24 2021, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Minister Talasani Srinivas Yadav

Minister Talasani Srinivas Yadav

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించడానికి కర్ణాటక నుంచి మంత్రి సహా అధికార ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలన పరిశీలించారు. కేసీఆర్  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కలిశారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు వెటర్నరీ డిపార్ట్‌మెంట్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును కర్ణాటక మంత్రి, ఇతర అధికారులు తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కర్ణాటక నుంచి వచ్చిన మంత్రి, అధికారులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర అధికారులు వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Minister Talasani Srinivas Yadav

Minister Talasani Srinivas Yadav

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ ప్రశంసించారు. పశువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్ పథకం బాగుందని కితాబిచ్చారు. పథకం పని తీరు భేష్ అని అన్నారు. పశువులకు అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోనూ పశుసంవర్ధక శాఖ పలు కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు.

ఇలా రాష్ట్రాలు పరస్పరంగా ఇరు ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను గురించి తెలుసుకోవడం ప్రజలకు మేలు చేకూరుస్తుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 1962 అంబులెన్స్ సర్వీసులు గోశాలలకు కూడా ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో లాగే కర్ణాటకలోనూ అక్కడి ప్రభుత్వం డైరీకి ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు.

34
Minister Talasani Srinivas Yadav

Minister Talasani Srinivas Yadav

1962 అంబులెన్స్ తెలంగాణలో అమలవుతున్న పథకమని, ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి శ్రీకారం చుడుతున్నదని మంత్రి తలసాని వివరించారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గంపెడు పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని వివరించారు.

ప్రతి సంవత్సరం 92 కోట్ల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నదని మంత్రి వివరించారు. యదవులు, కుర్మలకు సబ్సిడీ గొర్రెలు అందిస్తున్నామని తెలిపారు. అత్యల్ప సమయంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన ఘనత దేశంలో కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు సాగు, పరిశ్రమల రంగానికి విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.

44
Minister Talasani Srinivas Yadav

Minister Talasani Srinivas Yadav

రైతులకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టినట్టు వివరించారు. గొర్రెల పంపిణీలో 75శాతం సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. గొర్రెలకు ఉచిత వైద్యంతోపాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలను ప్రభుత్వమే నిర్మిస్తున్నదని తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.

About the Author

PR
pratap reddy
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Recommended image2
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved