కవిత ఓటమే: మండవకు బుగ్గకారు దూరం చేసిందా..?

First Published 27, Sep 2019, 3:20 PM

మండవ వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ చేసి అక్కడి నుంచి కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ తొలుత భావించినట్లుగా ప్రచారం జరిగింది. అది కుదరని పక్షంలో మండలి ఛైర్మన్ పదవినైనా ఇస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ కవిత ఓటమి మండవ వెంకటేశ్వరరావుకు శాపంగా మారింది

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొందరికి కాలం కలిసొచ్చి అందలం ఎక్కుతారు.. ఇంకొందరు మాత్రం ఎంత కష్టపడినా ఎక్కడ గొంగళి వేసిన చందంగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోతుంటారు. ఇక మరికొందరి విషయంలో అయితే ఎవరో చేసిన తప్పుకి వీళ్లు బలైపోతుంటారు. ఇప్పుడు ఈ మూడో కేటగిరీ కిందకే వస్తారు సీనియర్ రాజకీయ వేత్త మండవ వెంకటేశ్వరరావు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యుల్లో ఒకరిగా మండవ వెంకటేశ్వరరావుకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నిజామాబాద్ జిల్లాలో మంచి పట్టుంది. డిచ్‌పల్లి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో మంత్రిగా పనిచేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవకు ఆ జిల్లాలోని ఆంధ్రా సెటిలర్లలో గ్రిప్ ఉంది.. అయిన చెప్పిన మాటను జావదాటకుండా పనిచేసే ఎంతోమంది అనుచరులు ఉన్నారు

అయితే ఇదంతా గతం.. 2014లో రాష్ట్ర విభజన ఆయన రాజకీయ జీవితాన్ని గట్టిగా ప్రభావితం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో మండవ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోవడంతో వెంకటేశ్వరరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మండవను టీఆర్ఎస్‌లోకి చేర్చుకునేందుకు పావులు కదిపారు. టీడీపీలో మండవ వెంకటేశ్వరరావు, కేసీఆర్, తుమ్మల, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మధ్య బావా.. బావా అనుకునేంత సాన్నిహిత్యం ఉండేది. దీంతో తన ప్రియమిత్రుడికి గులాబీ కండువా కప్పేందుకు గాను చంద్రశేఖర్ రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్ అడిగిన వెంటనే మండవ కారెక్కేశారు. ఇంకేముంది వెంకటేశ్వరరావు ఇంట్లో సందడి నెలకొంది. ఎన్నికల సమయం కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు ఆయన నివాసానికి తరలివచ్చారు. దీంతో మండవకు రాజకీయంగా మళ్లీ కలిసొచ్చిందని అంతా భావించారు.

ఇక్కడే సీన్ రీవర్స్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి పాలయ్యారు. తమ సమస్యల కోసం పసుపు, ఎర్రజోన్న రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో కవిత ఓడిపోయారు.

అప్పటికే రైతుల ఆందోళన ఉద్ధృతంగా ఉన్నప్పటికీ.. మండవ టీఆర్ఎస్‌లో చేరడం ద్వారా నిజామాబాద్‌లో కవితకు సానుకూల వాతావరణం ఏర్పడతుందని కేసీఆర్ భావించారు. కానీ కల్వకుంట్ల వారి కుమార్తెను రైతులు, జనం పట్టుబట్టి ఓడించారు.

మండవ వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ చేసి అక్కడి నుంచి కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ తొలుత భావించినట్లుగా ప్రచారం జరిగింది. అది కుదరని పక్షంలో మండలి ఛైర్మన్ పదవినైనా ఇస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ కవిత ఓటమి మండవ వెంకటేశ్వరరావుకు శాపంగా మారింది. దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లయ్యింది.