Hyderabad : నగరవాసులకు అలర్ట్ ... ఫిబ్రవరి 17న ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
Hyderabad water supply : హైదరాబాద్ వాటర్ సప్లై విభాగం కీలక ప్రకటన చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే సోమవారం నీటి సరఫరా వుండదని తెలిపింది. ఆ ప్రాంతాలేంటో తెలుసా?

Hyderabad Water Supply
Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వచ్చే సోమవారం నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటటిన్ వాటర్ సప్లై ఆండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. కాబట్టి ప్రజలు ముందుగానే జాగ్రత్తపడి తాగునీటిని నిల్వ చేసుకుని పెట్టుకోవడం మంచింది... లేదంటే ఇబ్బందిపడాల్సి వస్తుంది.
Hyderabad Water Supply
ఫిబ్రవరి 17 సోమవారం ఉదయం నుండి నగరానికి నీటిసరఫరా కోసం ఉపయోగించే కొండపాక పంపింగ్ స్టేషన్ లో మరమ్మతులు చేపట్టనున్నట్లు HMWSSB (Hyderabad Metropolitan Water Supply & Sewerage Board) ప్రకటించింది. సాయంత్రం వరకు ఈ పనులు కొనసాగనున్న నేపథ్యంలో నగరంలోని చాలాప్రాంతాల్లో రోజంతా నీటిసరఫరా వుండదని తెలిపారు. తిరిగి మంగళవారం అంటే ఫిబ్రవరి 18న ఉదయం యధావిధిగా నీటిసరఫరా జరుగుతుంది.
Hyderabad Water Supply
ఈ ప్రాంతాల్లో నీటిసరఫరా బంద్ :
కూకట్ పల్లి, కేపిహెచ్బి, ఎల్లమ్మ బండ, వివేకానందనగర్, మూసాపేట, భరత్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఫతేనగర్, ఎస్ఆర్ నగర్,బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ,సోమాజిగూడ, మోతీనగర్ ప్రాంతాల్లో సోమవారం నీటిసరఫరా వుండదు.
ఇక చింతల్, సుచిత్ర,జీడిమెట్ల,షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఆల్వాల్, వెంకటాపురం, మచ్చబొల్లారం, యాప్రాల్, చాణక్యపురి ప్రాంతాల్లోనూ నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
హఫీజ్ పేట, మియాపూర్, కొంపల్లి, తెల్లాపూర్,బొల్లారం,గండిమైసమ్మ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, హకీంపేట, సికింద్రాబాద్, బిబినగర్ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా వుండదని హైదరాబాద్ నీటిసరఫరా విభాగం ప్రకటించింది.