MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • 2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు ... ఏకంగా 8 గంటలు సేవ్

2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు ... ఏకంగా 8 గంటలు సేవ్

హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాలంటే 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే గంట నుండి గంటన్నర ప్రమాాణమే. ఇంత తక్కువ సమయంలోనే రైలు ప్రయాణం ఉంటే... ఇదే త్వరలో జరగబోతోంది. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 17 2025, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hyderabad to Bangalore Bullet Train

Hyderabad to Bangalore Bullet Train

Hyderabad to Bangalore : భారతదేశంలో ఐటీ పేరెత్తగానే ముందుగా గుర్తుకువచ్చేది బెంగళూరు, హైదరాబాద్ నగరాలే. ఈ రెండు దక్షిణాది నగరాలు ఐటీ రంగంలో అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ కంపనీలైన మైక్రో సాఫ్ట్, గూగుల్ వంటివే కాదు ఇన్పోసిస్, టెక్ మహింద్రా, టాటా కన్సల్టెన్సీ వంటి దేశీయ ఐటీ సంస్థలు కూడా ఈ రెండు నగరాల్లో కొలువై ఉన్నాయి. ఇలా ఐటీ హబ్ లుగా మారిన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఐటీ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగుల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. 

ఇక ఇతర రంగాల్లోనూ హైదరాబాద్, బెంగళూరు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక తెలుగు, కన్నడ ప్రజల మధ్య విడదీయలేని సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజకీయ, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో పాటు ఐటీ ఉద్యోగులు, సామాన్యులు తరచూ హైదరాబాద్-బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటివారికి కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది. 

ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య తొందరగా రాకపోకలు సాగించాలంటే విమాన ప్రయాణమే దిక్కు. రైలు లేదా బస్సులో వెళ్ళాలంటే 10 నుండి 15 గంటల సమయం పడుతుంది. అంటే రోజులో సగం ప్రయాణానికే సరిపోతుంది... రానుపోను చూసుకుంటే దాదాపు ఒక్కరోజు ప్రయాణంలోనే గడిచిపోతుంది. విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది... నిత్యం ప్రయాణించే సామాన్య ఉద్యోగులు, ప్రజలు ఇంత ఖర్చు భరించలేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు మధ్య తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే ప్రయాణం సాగించేలా బుల్లెట్ ట్రైన్ ను తీసుకువస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Bullet Train

Bullet Train

బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ :

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైస్పీడ్ వందే భారత్ రైళ్ళను తీసుకువచ్చింది. సాధారణ రైళ్ల కంటే వేగంగా ఈ వందే భారత్ ట్రైన్స్ ప్రయాణిస్తాయి. అయితే ఇప్పుడు ఈ వందేభారత్ కంటే వేగంగా పరుగుతీసే బుల్లెట్ ట్రైన్ లను భారతీయులను పరిచయం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ (హై స్పీడ్ రైల్ కారిడార్) ప్రాజెక్టును చేపట్టారు. 

అయితే హైదరాబాద్-బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇది అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య కేవలం 2 గంటల్లోనే ప్రయాణం సాగుతుంది... అంటే ఇంచుమించు విమాన ప్రయాణ సమయంలోనే బుల్లెట్ ట్రైన్ గమ్యానికి చేరుకోవచ్చు. 

హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య దూరం 600 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అంటే బుల్లెట్ ట్రైన్ గంటకు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుందన్నమాట. ఇంతటి స్పీడ్ కు తగ్గట్లుగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు... కాబట్టి హైదరాబాద్, బెంగళూరు బుల్లెట్ ట్రైన్ 2041 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ రెడీ చేసింది నేషనల్ రైల్ ప్లాన్(NRP). 

ఈ హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా సాగనుంది. హైదరాబాద్-మహబూబ్ నగర్-గద్వాల-కర్నూల్-అనంతపూర్-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణం సాగుతుంది. ఇలా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రాలకు ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ప్రయోజకం కలుగుతుంది. 
 

33
Bullet Train in India

Bullet Train in India

బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదిత నగరాల పూర్తి జాబితా : 

1. ముంబై-అహ్మదాబాద్ - 508 కి.మీ మార్గం ‌- 2 గంటల్లోపే ప్రయాణం ( 2028 నాటికి పూర్తి)

2. డిల్లి - అహ్మదాబాద్ - 886 కి.మీ మార్గం ‌- 2‌-3 గంటల ప్రయాణం (2031 నాటికి పూర్తి) 

3. డిల్లి - వారణాసి -865 కి.మీ మార్గం -  2‌-3 గంటల ప్రయాణం (2031 నాటికి పూర్) 

4. వారణాసి - హౌరా - 711 కి.మీ మార్గం  - 2 గంటల ప్రయాణం  (2031 నాటికి పూర్తి)

5. హైదరాబాద్ - బెంగళూరు - 618 కి.మీ మార్గం - 2 గంటల్లోపే ప్రయాణం (2041 నాటికి పూర్తి) 

6. నాగ్ పూర్ - వారణాసి -855 కి.మీ మార్గం  - 2‌-3 గంటల ప్రయాణం (2041 నాటికి పూర్తి)

7. చెన్నై - మైసూరు - 435 కి.మీ మార్గం - 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)

8. డిల్లి - అమృత్ సర్ - 480 కి.మీ మార్గం - 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి) 

9. అమృత్ సర్ - జమ్మూ - 190 కి.మీ మార్గం - అరగంట నుండి గంటలోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)

10. ముంబై - హైదరాబాద్ - 711 కి.మీ మార్గం -  2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)

11. ముంబై - నాగ్ పూర్ -736 కి.మీ మార్గం - 2 గంటల్లోపే ప్రయాణం (2051 నాటికి పూర్తి)

12. పాట్నా - గౌహతి - 850 కి.మీ మార్గం - 2‌-3 గంటల ప్రయాణం  (2051 నాటికి పూర్తి) 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved