MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • Hyderabad : ఐఏఎస్, ఐపిఎస్ లే కుళ్లుకునేలా.. ఓ ఛాయ్ హోటల్ ఉద్యోగికి నెెలకు రూ.5 లక్షల జీతమే..!!

Hyderabad : ఐఏఎస్, ఐపిఎస్ లే కుళ్లుకునేలా.. ఓ ఛాయ్ హోటల్ ఉద్యోగికి నెెలకు రూ.5 లక్షల జీతమే..!!

Cafe Niloufer : ఓ ఛాయ్ హోటల్లో పనిచేసే ఉద్యోగికి సాధారణంగా ఎంత శాలరీ ఉంటుంది.. రూ.5,000 లేదంటే రూ.10,000. మహా అయితే రూ.20,000. కానీ ఓ హోటల్లో ఏకంగా నెలకు రూ.5 జీతం తీసుకునే ఉద్యోగులు ఉన్నారట… ఇంతకీ ఆ హోటల్ ఏదో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 20 2026, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీ షాప్ ఉద్యోగి శాలరీ ఇన్ని లక్షలా..!
Image Credit : Gemini AI

టీ షాప్ ఉద్యోగి శాలరీ ఇన్ని లక్షలా..!

Cafe Niloufer : హైదరాబాద్ అనగానే ఒకప్పుడు ఛార్మినార్, తర్వాత హుస్సేస్ సాగర్ లో బుద్దుడి విగ్రహం, హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ గుర్తుకువచ్చేవి. మరి ఇప్పుడో కేఫ్ నీలోఫర్ గుర్తుకువచ్చేలా పరిస్థితి మారిపోయింది. రూ.250 కి సింగిల్ ఛాయ్... రూ.1000 ఖరీదైన ఛాయ్ కూడా ఇక్కడ లభిస్తుంది. ఓ కుటుంబం సరదాగా ఈ కేఫ్ నీలోఫర్ కి వెళ్లిందో... నాలుగైదు వేల ఖర్చు ఖాయం.

బయట పది ఇరవై రూపాయలకు అమ్మే ఛాయ్ ఈ కేఫ్ నీలోఫర్ లో వందలు, వేలలో అమ్ముతున్నారు. ఇంత ఖరీదైన టీ షాప్ లో ధరలే ఇలా ఉన్నాయంటే పనిచేసేవారి శాలరీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా కేఫ్ నీలోఫర్ యజమాని అనుముల బాబురావు తనయుడు శశాంక్ ఓ కార్యక్రమంలో ఉద్యోగుల జీతాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాటలు వింటే ఛాయ్ షాపులో ఇంత జీతాలా..! ఐఏఎస్, ఐపిఎస్ లకు కూడా రావే అని ఆశ్చర్యపోవడం ఖాయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేఫ్ నీలోఫర్ లో హయ్యెస్ట్ శాలరీ ఎంత..?
Image Credit : X/RizGandotra

కేఫ్ నీలోఫర్ లో హయ్యెస్ట్ శాలరీ ఎంత..?

సాధారణంగా మీరు రోడ్డుపక్కన టీ షాప్ లో పనిచేసేవారిని మీ జీతమెంత అని అడగండి... ఏ ఐదువేలో, పదివేలో అని చెబుతారు. ఇక పెద్దపెద్ద కాఫీ షాప్ లలో ఉద్యోగులకు నెలకు రూ.15 వేల నుండి రూ.25 వరకు శాలరీ ఉంటాయి. మహా అయితే నెలకు రూ.50,000... ఇంతకంటే ఎక్కువ ఉండవు. కానీ హైదరాబాద్ లోని కేఫ్ నీలోఫర్ లో అత్యధిక శాలరీ రూ.60 లక్షలట... మీరు చూస్తున్నది నిజమే. ఏడాదికి అక్షరాలా అరవై లక్షల రూపాయలట... అంటే నెలకు దాదాపు 5 లక్షల శాలరీ. ఒక కెెఫే ఇంత శాలరీ ఇవ్వగలదా అని ఆశ్చర్యపోవడం మనవంతు.

ఇలా ఐఏఎస్, ఐపిఎల్ లు కాదు టాప్ సాప్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ శాలరీని కేఫ్ నీలోఫర్ లో కొందరు ఉద్యోగులు పొందుతున్నారన్నమాట. ఇంతింత శాలరీలు ఇస్తున్నారంటే ఈ కేఫ్ ఆదాయం ఇంకే స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కేఫ్ నీలో ఫర్ ఓ ఛాయ్ దుకాణం కాదు... కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే బిగ్ బిజినెస్.

34
కేఫ్ నిలోఫర్ లో ఏ ఉద్యోగాలుంటాయి..?
Image Credit : instagram

కేఫ్ నిలోఫర్ లో ఏ ఉద్యోగాలుంటాయి..?

కేఫ్ నీలోఫర్ లో శాలరీల గురించి తెలిసి మీరుకూడా అందులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే ఎలాంటి ఉద్యోగానికైనా కనీస విద్యార్హతలు అవసరమే. మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలకు ఎంబిఏ, బిటెక్ వంటి ఉన్నత చదువుల వారిని ఎంపికచేస్తారు. వీరికే లక్షల్లో శాలరీలు ఉండేది. ఇక సర్వీస్, క్యాషియర్, కిచెన్ విభాగాల్లో కూడా ఉద్యోగాలుంటాయి... హోటల్ మేనేజ్మెంట్, డిగ్రీలు చేసినవారికి అవకాశం కల్పిస్తారు. వీరికి నెలకు రూ.20 నుండి రూ.30 వేల శాలరీలే ఉంటాయి.

44
కేఫ్ నీలోఫర్ యజమాని సక్సెస్ స్టోరీ...
Image Credit : gemini

కేఫ్ నీలోఫర్ యజమాని సక్సెస్ స్టోరీ...

కేఫ్ నీలోఫర్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఫేమస్. కేవలం ఛాయ్ అమ్ముతూనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఈ బిజినెస్ ను ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న అనుముల బాబురావు అసలు చదువన్నదే ఎరగరు. ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో పుట్టిపెరిగిన ఆయన బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఓ ఛాయ్ హోటల్లో టేబుల్ క్లీనర్ గా పనిచేశారు... ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి 1978 లక్డికపూల్ లో కేఫ్ నీలోఫర్ ప్రారంభించాడు. అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు.

ప్రస్తుతం కేఫ్ నీలోఫర్ ఇరానీ ఛాయ్ తో పాటు బేకరీ ఉత్పత్తులను అమ్ముతున్నారు. లక్డికపూల్ (ప్రధాన శాఖ) తో పాటు హిమాయత్ నగర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలో బ్రాంచ్ లు ఉన్నాయి. ఇలా సాధారణ ప్రజలకే కాదు ధనవంతులకు అందుబాటులో ఉండే కేఫేలను బాబురావు ఏర్పాటుచేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
వ్యాపారం
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Cafe Niloufer: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మించిన జీతం.. నిలోఫర్ లో ఉద్యోగం చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఇదే
Recommended image2
Nawab Cafe Review: నవాబ్‌ కేఫ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఛాయ్‌ వాలాపై వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved